తెలుగు, సంస్కృత సాహిత్య రంగాలకు జీవితాన్ని అంకితం చేసిన డా. సుసర్ల శారదా పూర్ణ ను విశాఖ సాహితి సంస్థ ఉపాధ్యక్షులు, డా. కందాళ కనక మహాలక్ష్మి, కార్యదర్శి శంకర్ నీలు భాగవతుల, తదితరులు గౌరవ సత్కారం చేసారు. ఈ సందర్బంగా కనక మహాలక్ష్మి మాట్లాడుతూ గత 54 ఏళ్లుగా సాహిత్య రంగంలో ఎనలేని సేవ చేసిన వారిని సత్కరించడం, వారి రచనలను ప్రజలకు అందించడం చేస్తున్నామన్నారు. దానిలో భాగంగానే దేశ, విదేశాల్లో ద్విభాషా ప్రచారకర్త డా. శారదా పూర్ణ ను అభినందించడం జరుగుతోందని తెలిపారు.
శారదా పూర్ణ తెలుగు, సంస్కృత భాషల్లో పి హెచ్ డి చేసి, బంగారు పతకాలు కూడా పొందడం గమనార్హం. పూర్ణ చేసిన సాహిత్య కృషి కి గాను పూర్ణ బరంపురం విశ్వ విద్యాలయం వారు నుంచి డి లిట్ ( అత్యుత్తమ పురస్కారం ) పొందారన్నారు.
మహిళా మూర్తుల కృషి ఫలితంగా ఒక కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం కూడా ఉజ్వలంగా వెలుగొందుతాయన్నారు. తమ సంస్థ కు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.