అంతర్జాతీయ దిగ్గజం టీవీస్ మోటర్ కంపెనీ తమ సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 ఆవిష్కరణ #vvwnews

by vvwnews.com

అంతర్జాతీయ దిగ్గజం టీవీస్ మోటర్ కంపెనీ తమ సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110ని ఆవిష్కరించింది. విశాఖలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో టీవీఎస్ జూపిటర్ ను ఆవిష్కరించారు.
సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ బిజినెస్ హెడ్ అనిరుద్ధ హాల్దర్ మాట్లాడుతూ
తదుపరి తరం ఇంజిన్, భవిష్యత్ కాలపు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్లు అనేకం ఈ స్కూటర్ లో పొందుపరిచామన్నారు. మరింత ఎక్కువ స్టయిల్, మైలేజ్, పనితీరు, సౌకర్యం, సౌలభ్యం, భద్రత, టెక్నాలజీ ఇలా అన్నింటిలోనూ మరింత అధికంగా అందించాలనే లక్ష్యాన్ని ప్రతిఫలించే విధంగా సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 తీర్చిదిద్దబడిందని తెలిపారు. టీవీఎస్ జూపిటర్ అనేక మంది వాహనదార్లకు ఒక తిరుగులేని నేస్తంగా కొనసాగుతోందని, 65 లక్షల మంది పైగా కస్టమర్ల వైవిధ్య అవసరాలను నిరంతరం నెరవేరుస్తోందని చెప్పారు.

Use Social Media to Spread the Word about Our News

related articles