ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని వనమహోత్సవం కార్యక్రమాo…#vvwnews

by vvwnews.com

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని వనమహోత్సవం కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎంవీడీఎం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి దక్షిణ నియోజక వర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు స్థానిక నాయకులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వనమహోత్సవ కార్యక్రమానికి అవసరమైన మొక్కలను విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అందజేసింది. 1 మిలియన్ మొక్కల పంపిణీ లూ భాగంగా పోర్ట్ మొక్కలను అందజేసింది. సుమారు 3200 మొక్కలను పోర్ట్ సమకూర్చింది. ఈ మొక్కలను స్థానికులకు అందజేశారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస యాదవ్ మొక్కను నాటి కర్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలను పెంచాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే వివరించారు. మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమానికి పోర్ట్ చేసిన సహకారానికి ఆయన సంతోషం వ్యక్తం చేసారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను పోర్ట్ సహకారంతో కొనసాగిస్తామని వంశీకృష్ణ వెల్లడించారు. ప్రతిఒక్కరు తమ ఇంట్లో మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.

Use Social Media to Spread the Word about Our News

related articles