ఏ వీ స్ ఓవర్సీస్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 వ తేదిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 కార్యక్రమం జరుగుతుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి.ఏ. రాజు వెల్లడించారు. ఈ మేరకు డాబాగార్థన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శుక్ర వారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం విశాఖ కిర్లంపూడి లే అవుట్ వద్ద గల బీచ్ రోడ్ లో గల పామ్ బీచ్ హోటల్ లో సెప్టెంబర్ ఒకటో తేదీన ఉదయం 10 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు జరుగుతుందని అన్నారు. ఈ ఫెయిర్ లో 15 కి పైగా దేశాలు నుంచి టాప్ – 40 యూనివర్సిటీలు పాల్గొంటాయి అన్నారు. బ్యాచ్ లర్స్, ఎం ఎస్, ఎం బి ఎ, ఎం బి బి ఎస్, కోర్సుల్లో ప్రవేశాల కోసం అవగాహన కల్పిస్తాం అన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు సదుపాయం కూడా వుంటుంది అన్నారు. విద్యార్థులు సందేహాలు నివృత్తి చేస్తాం అన్నారు. త్వరలోనే తమ సంస్థకు అనుబంధంగా ఏర్పాటు చేసే ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసే ఆలోచనలో ఉన్నామన్నారు.
మీడియా సమావేశంలో సంస్థ మేనేజర్ బీ. రవి తేజ, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆర్. క్రిస్టోఫర్ పాల్గొన్నారు.
ఏ వీ స్ ఓవర్సీస్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 కార్యక్రమం#vvwnews
58