కామ్రేడ్ వై తులసి సంస్కరణ సభ అంగన్వాడీ నాయకురాలు సిఐటియు సభ్యురాలు

by vvwnews.com

*ప్రెస్‌ నోట్‌*
*తులసీ మరణం అంగన్‌వాడీ ఉద్యోగులకు తీరనిలోటు*
*అంగన్‌వాడీ వర్కర్స్‌ Ê హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ*
అంగన్‌వాడీ వర్కర్స్‌ Ê హెల్పర్స్‌ యూనియన్‌ విశాఖ జిల్లా అధ్యక్షులు వై.తులసీ అకాలమరణం అంగన్‌వాడీ ఉద్యోగులకు తీరనిలోటు అని ఆ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలకోసమే కాకుండా మొత్తం కార్మికవర్గ సమస్యలకు అండగా అంగన్‌వాడీ యూనియన్‌ ముందునడిపిన ఘనత తులసీదని కొనియాడారు.
శనివారం మధ్యాహ్నం డాబాగార్డెన్స్‌లో ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో వై.తులసీ సంస్మరణ సభ అంగన్‌వాడీ వర్కర్స్‌ Ê హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో పి.మణి అధ్యక్షతన జరిగింది. సభకు ముందు తులసీ చిత్రపటానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు, యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బరావమ్మ, బేబీరాణీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవి, బృందా, పద్మ, శోభ, వెంకటలక్ష్మి, తులసీ భర్త శ్రీనివాస్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, కుమారుడు దిలీప్‌, కుమార్తె స్వాతిలు పూలమాలవేసి నివాళర్పించారు. సుబ్బరావమ్మ, నరసింగరావులు మాట్లాడుతూ అంగన్‌వాడీ సమస్యల పరిష్కారం దిశగా ఉద్యమాలకు సిద్దంకావడమే ఆమెకు ఇచ్చిన నిజమైన నివాళని అన్నారు. తులసీ ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుండి జిల్లా అధ్యక్షురాలు స్థాయికి వెళ్లిందన్నారు. జనవరిలో జరిగిన 42రోజులు సమ్మె పోరాటం మొత్తం కార్మికవర్గం యొక్క మద్దతును కూడగట్టడంలో సిఐటియు నిర్ణయాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేయడంలో మంచి కృషి చేసారు. ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు ప్రయోగించినా, బెదిరింపులకు దిగినా ప్రజల యొక్క మద్దతును కూడా పొందే విధంగా ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. ఆమె చేసే ఉద్యమానికి తన కుటుంబ సభ్యులు కూడా అండగా నిలవడాన్ని గుర్తుచేసారు. రాబోయే కాలంలో సమ్మె పోరాటం సందర్భంగా రావాల్సిన జివోలు, హక్కులను సాధించడంతో పాటు అంగన్‌వాడీ కార్మికులందర్నీ రాజకీయంగా చైతన్యం తీసుకురావడం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరపడమే ఆమెకు ఇచ్చిన నిజమైన నివాళన్నారు. ఆమె హఠాత్తు మరణం యూనియన్‌కే కాకుండా విశాఖ కార్మిక వర్గానికి, ప్రజాఉద్యమాలకు తీరని లోటు. ఆమె మరణానికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో
ఇట్లు
పి.మణి
గౌరవాధ్యక్షులు

Use Social Media to Spread the Word about Our News

related articles