సింహాచల దేవస్థానం చందనోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా చూసుకున్నారు

by vvwnews.com

తేదీ.10-05-2024,
విశాఖపట్టణం.

*చందనోత్సం వేడుకలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున*

*గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టిన యంత్రాంగం*

*తెల్లవారు ఝాము నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్న జిల్లా కలెక్టర్*

*క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీరు అందజేస్తున్న సేవకులు*

*యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు*

*కొండ దిగువ నుంచి పైకి చేరుకునేలా మిని ఏసీ బస్సులు, ఆర్టీసి బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు*

*ట్రాఫిక్ సమస్యకు తలెత్తకుండా ఎక్కడికక్కడ సిబ్బంది నియామకం.. ఎప్పటి వాహనాలను అప్పుడే పంపించేస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది*

*స్కాన్ చేస్తూ టికెట్స్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న దేవాదాయ శాఖ సిబ్బంది*

*టికెట్స్ లేని వారు లోపలకు వెళ్లకుండా క్యూ లైన్ల వద్ద పరిస్థితిని గమనించి సూచనలు జారీ చేసిన జిల్లా కలెక్టర్*

*భక్తులకు ఇబ్బంది లేకుండా 169 ప్రాంతాల్లో తాగునీరు ఏర్పాటు*

*ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్న జిల్లా కలెక్టర్*

*కమాండ్ కంట్రోల్ రూమ్ల ద్వారా భక్తుల రాక, సందర్శన పరిస్థితులను పర్యవేక్షిస్తున్న వివిధ విభాగాల అధికారులు*

*ట్రాఫిక్ అంతరాయం లేకపోవటం, క్యూ లైన్ల వద్ద రద్దీ లేకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు వల్ల త్వరితగతిన దర్శనాలు పూర్తి చేసుకుంటున్న భక్తులు*

*అధికారులు చేపట్టిన చర్యలపై సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు*

………………………………
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విశాఖపట్టణం.

Use Social Media to Spread the Word about Our News

related articles