టిడిపి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే VRK బాబు అత్యధిక మెజార్టీతో గెలవాలని డోర్ టు డోర్ నిర్వహించారు

by vvwnews.com

*తూర్పులో హెరెత్తించిన వెలగపూడి ఎన్నికల ప్రచారం*
*–కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో నిర్వహణ*
*–భారీగా హాజరైన మహిళలు, ప్రజలు*
*–కూటిమితోనే పేదలకు పూర్తిస్ధాయిలో సంక్షేమ పధకాలు: కంచర్ల*

విశాఖపట్నం :

విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ సీనియర్‌ నాయకులు, ఉపకార్‌ చారిటబుల్‌ ట్రస్టు అధినేత, సీని నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో కూటిమి ఎమ్మెల్యే అభ్యర్ధి వెలగపూడి రామకృష్ణబాబుకు సంబంధించి ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. నగరంలోని ఆరిలోవ 12, 13 వార్డుల్లోని నెహ్రు నగర్,అరికోవ కొలని, జె ఆర్ ఎమ్ బ్లాక్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్ధి వెలగపూడి రామకృష్ణబాబుతో కలసి అచ్యుతరావు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుతరావు అభిమానులు, స్ధానిక ప్రజలు వెలగపూడికి మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడుగుడుగునా బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రజలంతా మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం ఉపకార్‌ చారిట్‌బుట్‌ ట్రస్టు అధినేత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయంలో పేదలకు ఎటువంటి మేలు జరగలేదున్నారు. అమ్మవడి పేరుతో పేదలను, విద్యార్ధుల తల్లిదండ్రులను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల రూ.1500తో పాటు, ఇంటిలో ఎంత మంది విద్యార్ధులున్నా వారికి ఏడాదికి రూ.15వేలు అందిస్తామన్నారు.అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటు ఎన్నో సంక్షేమ పధకాలు చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారన్నారు. చంద్రబాబు హయంలోనే పేదలకు పూర్తిస్ధాయిలో సంక్షేమ పధకాలు అందుతాయన్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఎస్సి కార్పొరేషన్ కార్యదర్శి పారిపల్లి రామారావు, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ఇంచార్జి సుదీర్, నెహ్రూ నగర్ అధ్యక్షుడు పొట్టి అప్పారావు, ఎర్ని దుర్గ నగర్ ప్రెసిడెంట్ ,లీల సుందర్ నగర్ ప్రెసిడెంట్ సన్యాసిరావు ,ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో పాటు,శివాలయం కమిటీ మెంబర్ బాషా, టీడీపీ నేతలు గాడి సత్యం, యువనేత చిన్న, 13వార్డు రాజు ఉమ్మడి పార్టీ నేతలు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles