వంశపారంపర్య కంటి వ్యాధులపై అవగాహన
విశాఖపట్నం, 5 ఏప్రిల్ 2024: వంశపారంపర్య కంటి వ్యాధులు (HED) అంటే పేరులోనే కనిపిస్తుంది తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైనదని. “వంశపారంపర్య కంటి వ్యాధులు (HED) రక్తసంబందీకులు అంటే దగ్గరి బంధువుల మధ్య జరిగే వివాహాలు వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ వ్యాధులు రెటీనా, కార్నియా, లెన్స్ మరియు ఆప్టిక్ నరాల వంటి వివిధ కంటి భాగాలను ప్రభావితం చేస్తాయి. ఇది దృష్టి లోపానికి దారి తీస్తుంది. ఇటువంటి కేసులలో పిల్లలు కార్నియల్ మచ్చలు, పుట్టుకతో కంటిశుక్లం, గ్లాకోమా మరియు రెటినిటిస్ పిగ్మెంటోసా వంటి వ్యాధి లక్షణాలుతో పుడతారు. అలాటి వారిని గుర్తించి ముందస్తుగా చికిత్స అందించుటాలి నిర్లక్ష్యం చేస్తే వదిలేస్తే, అవి వారి జీవన విధానానికి విఘాతం కలిగించవచ్చును మరియు అంధత్వానికి కూడ దారితీయవచ్చు. వంశపారంపర్య కంటి వ్యాధులు (HED) తీవ్రతను మరియు వృద్ధిని సరిచేయవచ్చును. ఇందుకోసం ముందస్తుగా గుర్తించడం, చికిత్స అందించటం కీలకం. కంటి వ్యాధి అంచనా వేయుటకు మరియు వారి కంటి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి వంశపారంపర్య కంటి వ్యాధులు ఉన్న కుటుంబ సభ్యులకు జన్యుపర సూచనలు అందించ వచ్చును . తద్వారా భవిష్యత్తులో జరిగే గర్భాల ద్వారా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం గురించి తల్లిదండ్రులు అవగాహన పొందే అవకాశం కలుగుతుంది.
LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్స్ (ఆంధ్రప్రదేశ్ కంటి వ్యాధి అధ్యయనం లేదా APEDS) వారు గతంలో చేసిన అధ్యయనం వలన రక్తసంబంధికుల మధ్య వివాహాలు మరియు వాటి వల్ల కళ్లపై ప్రభావాల గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు వెల్లడయ్యాయి. మేనమామలు మరియు మేనకోడళ్ళు లేదా దగ్గరి బంధుత్వాలు మధ్య జరిగే వివాహాల వల్ల కొన్ని కంటి వ్యాధులు సంభవిస్తాయని పేర్కోవటం జరిగినది.
వంశపారంపర్య కంటి వ్యాధులు (HED) అవగాహన కార్యక్రమం: LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (LVPEI), GMR వరలక్ష్మి క్యాంపస్ ఈ కంటి వ్యాధి గురించి అవగాహన , ఈ పరిస్థితులకు కారణాలు, ముందస్తుగా గుర్తించటం మరియు వాటిపట్ల శ్రద్ధ చూపాల్సిన ప్రాముఖ్యతను తెలియ చేయుటకు 6 ఏప్రిల్ 2024న ఒక అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ అవగాహన ఉద్యమంలో సాధారణంగా సంక్రమించే కంటి వ్యాధులు, పర్యవసానాలు, వారసత్వ కారణాలు, అందుబాటులోని చికిత్సలు గురించి LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (LVPEI) అవగాహన కలిగిస్తుంది. కొన్ని కేసులను శస్త్రచికిత్సా విధానం ద్వారా నయం చేయవచ్చును మరికొన్ని సరిదిద్దలేకపోవచ్చు.ఇటువంటి పరిస్థితులలో తక్కువ దృష్టి పరికరాలు, జీవనశైలి మార్పులు, సహాయకులు అవసరం కావచ్చు.
LVPEI / GMR వరలక్ష్మి క్యాంపస్, విశాఖపట్నం, హెడ్ డాక్టర్ వీరేందర్ సచ్దేవా వంశపారంపర్య వ్యాధుల నివారణ ప్రాముఖ్యతను వివరించారు”ఈ ప్రాంతంలో విశ్వసనీయ నేత్ర సంరక్షణ సంస్థగా, మేము వ్యక్తులు మరియు కుటుంబాలపై వంశపారంపర్య కంటి వ్యాధుల ప్రభావాన్ని గుర్తించాము మరియు అవగాహన పెంచడం మరియు తక్కువ దృష్టి పరికరాలు, దృష్టి కల్పించుట , ఇతర సేవల ద్వారా కోలుకోలేని అంధత్వ వ్యాధులను సకాలంలో తగిన చికిత్స అందించటం ద్వారా వాటి ప్రభావాన్ని మేము తగ్గించగలము, అలాగే ఖచ్చితమైన జన్యు సలహాను అందించడం ద్వారా భవిష్యత్ తరాలకు దృష్టిని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.” అన్నారు.
LVPEI HEREDITARY 👀👁️👀 EYE DISEASE వంశ పారంపర్యంగా జబ్బు నయం అవుతుంది అన్నారు కొంతవరకు నివారించవచ్చు
62