సినిమా ప్రమోషన్ పారిజాత పర్వం కామెడీ క్రైమ్ టిల్లర్ ఏప్రిల్ 19 రిలీజ్ అవుతుంది

by vvwnews.com

క్రైమ్ కామెడీ చిత్రం పారిజాత పర్వం ఈ నెల 19న విడుదల.
(విశాఖపట్నం, ఏప్రిల్ 4)
ప్రేక్షకులకు మంచి వినోదం పంచనున్న క్రైమ్ కామెడీ చిత్రం పారిజాత పర్వం సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత వనమాలి క్రియేషన్స్ పద్మ తెలిపారు. ఈ చిత్రం ప్రమోషన్ సందర్భంగా గురువారం నగరంలోని సిరిపురం జంక్షన్ వద్ద గల ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ బృందం సభ్యులు పాల్గొన్నారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా పారిజాతపర్వం నిర్మించామని, తప్పకుండా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూర గొంటామని తెలిపారు. ప్రముఖ నటుడు సునీల్, శ్రద్ధాదాస్, ప్రధాన పాత్రల్లో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ పారిజాత పర్వం సినిమా ఈ నెల 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందన్నారు. ఈ చిత్రంలో చైతన్య రావు మదాది, మాలవిక సతేషన్, వైవా హర్ష , శ్రీకాంత్ అయ్యంగర్ నటించా రన్నారు. సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు మంచి వినోదం, ఆహ్లాదం, ఆనందం కలిగిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నామన్నారు. సినిమా డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఇది కిడ్నాప్ డ్రామా కథనంతో కూడిన సినిమా అన్నారు. ఆద్యంతం హాస్య కథతో కూడిన ఈ సినిమాను గత పదేళ్లలో రాని కథతో నిర్మించామన్నారు. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకంతో వున్నామన్నారు. ఎవరు ఎవరిని కిడ్నాప్ చేస్తారు అన్నది తెర మీద హాస్య భరితంగా ఉంటుందన్నారు. ఈ సినిమాకు నూతన సంగీత దర్శకుడు రీ సంగీతం అందించా రన్నారు. హీరోయిన్ శ్రద్ధాదాస్ మాట్లాడుతూ, పారిజాత పర్వం టైటిల్ ఆసక్తి కరమైన టైటిల్ అనియు, ఇది నటనకు ఆస్కారం వున్న పాత్రన్నారు. తనకు తెలుగులో కొంత గ్యాప్ వచ్చినా సరే కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేశానన్నారు. హీరో చైతన్యరావు మదాది మాట్లాడుతూ, విశాఖ తనకు ఎంతో ఇష్టమైన, ప్రత్యేక నగరమన్నారు. సునీల్ కొంత విరామం తరువాత ఇందులో మంచి కామెడీ పండించే పాత్రలో నటించారు. హర్ష, సుందరం మాస్టర్ సినిమాల తరువాత మరో మంచి పాత్ర చేశారని ప్రశంసించారు. త్వరలోనే ఈ సినిమా ట్రై లర్ విడుదల చేస్తామన్నారు. నటుడు వైవా హర్ష మాట్లాడుతూ తమ చిత్ర యూనిట్ తిరుపతి , విశాఖ సహా అన్ని జిల్లాల్లో ప్రమోషన్ చేస్తున్నా మన్నారు. విశాఖ లో మంచి టాక్ వస్తే సినిమా ఘన విజయం సాధించినట్టే భావిస్తా మన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles