దువ్వాడ లో భూమి ఆక్రమణ
– బీ వీ రమణ దౌర్జన్యం
– బెల్లం కొండ అప్పల రాజు కుటుంబం ఆవేదన
విశాఖ పట్నం:
దువ్వాడ లో గల తమ భూమి ఆక్రమణ కోసం కొందరు గూండాలు దౌర్జన్యం చేస్తున్నారు అని
బెల్లం కొండ శ్రీనివాస రాజు ఆరోపించారు. ఈ మేరకు విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన తండ్రి అప్పల రాజు దువ్వాడ లో 1965 సంవత్సరంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేశాం. అక్కడ యూక లిప్టస్ తోటలు పెంచు తున్నం. ఆరు నెలల క్రితం తోటలు కోసి వేసి ప్రహరీ గోడ నిర్మించాం. కానీ, మార్చి 4 న కొందరు గూండాలు అక్రమంగా ప్రవేశించి గోడలు ధ్వంసం చేశారు. దీంతో తాము బీ వి రమణ బోండా కొండల రావు, భాస్కర రావు, త్రిమూర్తి ల మీద స్పందన లో పోలీసులు, కలెక్టర్ లకు ఫిర్యాదు చేశాం మళ్ళీ దౌర్జన్యం చేసి కొట్టారు. వైసీపీ హస్త ము వుందని అనుమానాలు కలుగుతున్నాయి. భూముల కబ్జా కి బీ వి రమణ తమ కుటుంబం మీద దౌర్జన్యం చేస్తున్నారు అని విచారం వ్యక్తం చేశారు.
భూమి యజమాని మనవడు
వినోద్ కుమార్ రాజు మాట్లాడుతూ, తన తాత కు వడ్ల పూడి లో నివాసం వుంటున్నారు. దువ్వాడ లో 42 ఏ/1, 2 బీ సర్వే నంబర్ లో రెండు ఎకరాల భూమి వుంది. బీ వి రమణ ఆక్రమణ కు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసు స్టేషన్ లో పలు కేసులు వున్న వ్యక్తులు తమ కుటుంబం మీద దౌర్జన్యం చేస్తున్నారు. సి ఐ ఇరు పక్షాల మధ్య రాజీ చేశాం అని చెప్పారు. 30 మంది వ్యక్తులు తమ కుటుంబం మీద దౌర్జన్యం చేసి బంగారం, మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. దీంతో, తాము సి ఐ ఏర్రం నాయుడు కి ఫిర్యాదు చేసాము. అలాగే, డి సీ పి సత్తి బాబు భూమి గొడవలు సివిల్ మేటర్ కాబట్టి కోర్టులో పరిష్కారం చేసుకోవాలి అని చెప్పారు అని వివరించారు.
భూమి యజమాని కుమార్తె
అన్న పూర్ణా మాట్లాడుతూ, తన తండ్రి భూమి కొనుగోలు చేశారు అని గుర్తు చేశారు. నెల రోజులుగా బోండా కుటుంబీకులు భుమి ఆక్రమణ కోసం దౌర్జన్యం చేస్తున్నారు. తమ భుమి ఆక్రమణ కోసం రెండు కోట్లు చేతులు మారాయిని ఆరోపించారు. గాజువాక వి ఆర్ ఓ భూమి సర్వే చేయించారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పోలీసు కమిషనర్, గాజువాక తహశీల్దార్ స్పందించి తమకు న్యాయం చేసి భూమి అప్పగించాలని కోరారు.