April 3, 2024

by vvwnews.com

*దేశంలో బిజెపిని రాష్ట్రంలో వైసీపీ, టీడిపి జన సేన కూటమి ఓటమే విదసం లక్ష్యం….*
*రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్ కూటమి కే దళితుల ఓటు..*
*విదసం రాజకీయ తిర్మాణo …..*

కేంద్రంలో మళ్లీ అధికారం ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని బహిరంగ ప్రకటన చేసిన బిజెపిని , రాష్ట్రంలో బీజీపీ అలయెన్స్ టీడిపి జనసెన పార్టీలకు దళితుల మద్దతు ఉండదని , అలాగే డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసి సంక్షేమ పథకాలకు సమాధి కట్టిన వైసీపీని కసిగా ఓడించాలని విదసం ఐక్య వేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వేంకట రావు అన్నారు….
ఈ రొజు విశాఖ నగరంలో అంబెడ్కర్ భవన్ వద్ద జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో వెంకట రావు మాట్లాడుతూ
10ఏళ్లుగా కేంద్రంలో అధికారం లో ఉన్న బిజేపి భారత రాజ్యాంగానికి అడుడగునా తూట్లు పొడుస్తోంది, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్నే మార్చెస్తాం అని ప్రకటించింది ఇది దేశానికి ప్రమాదకరం ఆని ఆందోళన వ్యక్తం చేశారు..మణిపూర్ లో ఆదివాసీలపై మత విద్వేషంతో మారణ హోమం సృష్టించి వందల మంది మాన ప్రాణాలను బలి తీసుకోవడం తోపాటు దేశంలో ఆదివాసీలు , దలితులు, క్రైస్తవ ముస్లిం మైనార్టీల కు రక్షణ లేదన్నారు . రాజ్యాంగ పీఠికలో లౌకికవాదం అనే పదాన్ని తొలగించి మనువాద దృక్పధంతో భారత దేశాన్ని మత రాజ్యంగా మార్చే కుట్ర జరుగుతోందని బిజేపి చేతిలోంచి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం ఉంది దానికోసం కాంగేస్ నేతృత్వంలో ఉన్న అతిపెద్ద రాజకీయ లౌకిక కూటమి ఇండియా కూటమిని గెలిపించడం తక్షణ అవసరం అని ఉద్ఘాటించారు . కాంగ్రెస్ కూటమిలో బీఎస్పీ ఇతర నీలి పార్టీలను కలిపి విశాల ప్రజాస్వామిక వేదిక నిర్మించాలన్నారు ….
వేధిక సలహాదారు ఎస్ ఆర్ వేమన మాట్లాడుతూ
రాష్ట్రంలో వైసీపీ పార్టీ బిజేపి పంచన చేరి దళితులను ,మైనారిటీలను హత్యలు చేస్తూ శవాలను ఇళ్లకు పార్శిల్ చేస్తూ హంతకులను బుజాలకెత్తుకుని ఎస్సీలకు ఛాలెంజ్ విసుర్తుందన్నారు .. ఎస్సి ఎస్టీ కార్పొరేషన్లకు తాళాలు వేసి సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి 20 కి పైగా సంక్షేమ పథకాలను సమాధి చేసిన వైసిపికి దళితులను ఓటడిగే నైతిక హక్కు లేదన్నారు.. కోడి కత్తి శీను బెయిల్, రద్దయిన పథకాల సాధన కోసం క్షేత్ర స్థాయి నుండి అమరావతి వరకూ విదసం సమరశీల పోరాటాలు చేసిందని గుర్తు చేశారు…
ఈ రాష్ట్రంలో మెమే ప్రత్యామ్నాయం అన్న టీడిపి, జన సేన కూటమి బిజేపి తో జట్టుకట్టి దళితులను, లౌకిక వాదులను దూరం చేసుకుందన్నారు …
గతంలో నీలి జెండాకు ఓటు ద్వారా బహుజన రాజ్యాది కారం ఆని ప్రకటించిన విదసం నేడు దేశ విపత్కర, తప్పని పరిస్థితుల్లో తన పందా మార్చుకుందని ,బిజేపి నుండి దేశాన్ని,రాజ్యాంగాన్ని కాపాడు కోవడానికి అతిపెద్ద లౌకిక కూటమి ఇండియా కూటమికి మద్దతు పలకాలని ఆని విదసం కమిటి నిర్ణయించిందని స్పష్టం చేసారు…
సహాయ కన్వీనర్ సోడదాసి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బల్ల కుమార్, ,జాజి ఓంకార్, బోడపాటి శామ్యూల్ కుమార్, బూల భాస్కర రావు, గుడాల ఈశ్వర రావు, పీ శ్రీనివాస్, మందా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…

Use Social Media to Spread the Word about Our News

related articles