ట్యుటెలేజ్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు
విశాఖపట్నం 24 మార్చి 2024 ట్యుటెలేజ్ ప్లే స్కూల్ మరియు కిండర్ గార్టెన్ వారు ఈరోజు స్థానిక MVP కాలనీలోని స్పోర్ట్స్ అరేనా నందు తమ స్కూల్ 4వ వార్షికోత్సవం మరియు గ్రాడ్యుయేషన్ వేడుకలను అత్యంత సంబరంగా నిర్వహించారు. నాలుగు సంవత్సరాల క్రితం 2020 లో నరసరీ విద్యా రంగంలో 20 సంవత్సరాల అనుభవశాలురైన ముగ్గురు మెంటర్లు సంయుక్తగా ట్యుటెలేజ్ ప్లే స్కూల్ స్థాపించారు. పిల్లలో దాగిన ప్రతిభ నైపుణ్యతలను వెలికితీయాలనే ఆశయంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు..
చిన్నారులు హాయిగా సంతోషంగా ఆడుకోవటానికి మరియు నేర్చు కోవటానికి అవసరమైన చక్కని స్థలం మరియు సౌకర్యాలు కల్పించారు. ట్యుటిలేజ్ ప్లే స్కూల్ నందు ప్రతి 10 మంది పిల్లలకు ఒక మెంటర్ ను నియమిస్తారు దీనివలన పిల్లలు అందరి పైన ప్రత్యేక దృష్టి పెట్టి అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాక పిల్లల మనసులోకి మన సంస్కృతి సంప్రదాయాలను తెలియ చెప్పే విధంగా విద్యా సంవత్సరం పొడవునా వచ్చే పండుగలు మరియు వాటి ప్రాముఖ్యతల గురించి సులభంగా అర్ధం చేసుకునే రీతిలో పండుగలు మొదలైన వాటిని వేడుకగా నిర్వహిస్తుంటారు. అలాగే పిల్లలలో ఆసక్తిని పెంపొందించుటకు ప్రముఖమైన బయట ప్రదేశాలకు తీసుకు వెళ్లి వారికి సరదాగా ఉల్లాసంగా విజ్ఞానాన్ని అందిస్తుంటారు. ట్యుటెలేజ్ ఒలింపిక్స్ ను క్రీడా దినోత్సవంగా నిర్వహించారు మరియు పిల్లలు అందరు చాల ఉత్సాహంగా మరియు ఆసక్తిగా ఈ క్రీడలలో పాల్గోవటం జరిగినది.
ట్యుటెలేజ్ ప్లే స్కూల్ ఈరోజు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో పిల్లలు అందరు తమ వయో వర్గం ఆధారంగా వేదిక పైన అద్భుతంగా నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. వారి ప్రదర్శనలు చుసిన పలువురు ప్రసంశల వర్షం కురిపించారు. ఈ వార్షికోత్సవ వేడుకలలో గత నాలుగు శతాబ్దాలుగా వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఆంధ్రా వైద్య కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరం తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొని పిల్లలు కనపరచిన ప్రావీణ్యతలను కొనియాడారు. ఈ వార్షికోత్సవ వేడుకలను ట్యుటెలేజ్ ప్లే స్కూల్ ఉపాధ్యాయ బృందం మరియు సిబ్బంది చక్కని ప్రణాళికతో క్రమశిక్షణతో నిర్వహించారు.
చివరగా ట్యుటెలేజ్ ప్లే స్కూల్ నుండి ఉత్తీర్ణత పొందిన UKG విద్యార్థులకు ముఖ్య అతిధి గ్రాడ్యుయేషన్ క్యాప్ మరియు సర్టిఫికేట్ లను అందచేసారు. తమ పిల్లల గ్రాడ్యుయేషన్ వేడుకలను తిలకించిన తల్లితండ్రులు ఆనందంతో ఉప్పొంగారు.