*మహిళాసాధికారతే సీఎం జగన్ లక్ష్యం*
*ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి*
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాద్యతలు స్వీకరించిన మొదటి రోజునే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని రాజ్యసభ సభ్యులు, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి అన్నారు.
వైసిపి రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు, డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సోమవారం మాధవధార వుడా కాలనీ 80 ఫీట్ రోడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ
ప్రభుత్వ పథకాలు అధికశాతం మహిళలకే అందిస్తున్నారని,
మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే విధంగా 5 ఏళ్లలో 27 వేల కోట్లు డ్వాక్ర ఋణాలు సీఎం జగన్ మాఫీ చేసారని గుర్తు చేశారు. చేయూత పథకం ద్వారా ప్రతి మహిళకు 5 ఏళ్లలో 75 వేల రూపాయలు అందించిన సీఎం జగన్
మహిళా రక్షణకు దేశంలో ఎక్కడ లేనివిధంగా దిశ యాప్ ను ప్రవేశపెట్టారన్నారు.
ప్రతి ఇంట్లో మహిళలదే పై చేయి ఉండాలనే ఉద్దెశంతో మహిళల పేరుమీదే ఇళ్ల పట్టాలు, అమ్మ వడి, చేయుత వంటి వాటితో మహిళలకు ఆర్థిక లబ్ది చేకూర్చారన్నారు.
నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం బాలిక దశ నుండే వారికి మౌలిక వసతులు కల్పించారని, ముఖ్యంగా బాలికలకు సంబంధించి మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఆయా పాఠశాలల్లో టాయిలెట్స్, తరగతి గదులు ఆధునికరించారన్నారు.
విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి బొత్స ఝన్సీ మాట్లాడుతూ
మహిళ విషయంలో గతం వేరు వేరుగ ఉండేదని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు.
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి నాడే మహిళల కష్టాలు తొలగిపోయాయన్నారు.
ఆకాశంలో సగభాగం మహిళలు కనబడాలన్న తపన ముఖ్య మంత్రిగా జగన్ కి ఉందని, అయితే వైసీపీ ప్రభుత్వ హయంలో మహళలుగా తాము ముందున్నామనే సంకేతాలు పంపారని అన్నారు. అందుకు ఉదాహరణగ నగరంలో మేయర్ గా మహిళకు ఆవకాశం కల్పించడంతో పాటుగా తనను గుర్తించి విశాఖ ఎంపీ అభ్యర్థిగ ఎంపిక చేసి సీఎం జగన్ మహిళలపై తన ఔదార్యం చాటుకున్నారని ఝాన్సీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు వరుదు కళ్యాణి, ఉత్తర నియోజకవర్గం సమన్వయ కర్త కేకే రాజు,శాసన సభ్యులు నాగిరెడ్డి,జిల్లా అధ్యక్షులు కోలా గురువులు,వీయం ఆర్డియే చైర్మన్ సనపల చంద్రమౌళి,మాజీ శాసన సభ్యులు రహిమాన్, గురుమూర్తి రెడ్డి,నాయుకులు బెహరా భాస్కర్ రావు, బాణాల శ్రీనివాస్,కార్పొరేటర్ లు అల్లు శంకర రావు, రియ్యి వెంకటరమణ, శశికళ, పద్మ రెడ్డి, సానపతి అప్పారావు,మహిళా నాయుకులు కృపాజ్యోతి, యువ శ్రీ, ఉమారాణి, వెంకటలక్ష్మి,రాధ,సునీత, తదితరులు పాల్గొన్నారు. సంస్కృతిక విభాగం జోనల్ ఇంచార్జి వంకాయల మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.