జనసేన దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి కందుల నాగరాజు 2000 గొడుగులు రోడ్డు మీద వ్యాపారస్తులకు బహుకరించారు.

by vvwnews.com

పవనన్న ఆశయాలకు అనుగుణంగా ప్రజా సేవ చేస్తా!… దక్షిణ జనసేన సీనియర్ నాయకుడు డా.కెఎన్ఆర్.
విశాఖదక్షిణం, తేదీ మార్చ్ 4.
జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు, ఆదేశాలకు అనుగుణంగా విశాఖ దక్షిణ నియోజక వర్గంలో శక్తి వంచన లేకుండా పని చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన విశాఖ దక్షిణ నియోజక వర్గంలోని 29, 31, 36వ వార్డుల్లోని చిరు వ్యాపారులకు, తోపుడు బండ్ల వ్యాపారులకు, ఫుట్ పాత్ వ్యాపారులకు రానున్న వేసవికాలం కోసం గొడుగులను పంపిణీ చేశారు. ఇలానే మొత్తం దక్షిణ నియోజక వర్గమంతా గొడుగులు పంచి పెడతామన్నారు. ఆయన మాట్లాడుతూ ఉదాత్తమైన ఆశయాలతో రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించడం కోసం రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేసిన పవనన్నకు రానున్న ఎన్నికల్లో ప్రజలంతా ఏక పక్షంగా అండగా నిలబడితే రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు సంభవించి రాష్ట్ర రూపు రేఖలే మరిపోతా యన్నారు. ఆ రోజు కోసం మనమంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ జనసేన యువ నాయకులు కందుల బదరీ నాథ్, కందుల కేదార్ నాథ్, 29వ వార్డు జనసేన అధ్యక్షుడు అంగటి శ్రావణ్, 31వ వార్డు జనసేన అధ్యక్షురాలు రూప, 36వ వార్డు జనసేన అధ్యక్షుడు పడమటి శ్రీను, నాయకులు గాజుల శ్రీను, వెంకటేష్, నవీన్, రాజు, వీరయ్య, జనసేన వీరమహిళలు కుమారి, దుర్గ, హేమ, లలిత, దేవి, మణి తదితరులు హాజరై గొడుగులు పంచి పెట్టారు.

Use Social Media to Spread the Word about Our News

related articles