జోహార్ పుల్వామ దాడిలో అమరులైన వీరులకు ఘన నివాళులర్పించిన భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా

by vvwnews.com

Press Note

*అమరవీరుల స్థూపం వద్ద పుల్వామా దాడిలో అమరులైన వీర జవానులకు నివాళులర్పించిన బీజేపీ నాయకులు.*

ఈరోజు అనగా 14-02-2024 బుధవారం సాయంత్రం బీచ్ రోడ్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ విశాఖపట్నం పార్లమెంట్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన వీర జవానులకు నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు GVL నరసింహారావు మాట్లాడుతూ సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం 2019 ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్‌ లోని పుల్వామా జిల్లాలో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిందని, ఈ దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు విడిచారని అన్నారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయని అన్నారు.

పుల్వామా దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై సర్జికల్ దాడులు చేయించి, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో తిష్టవేసిన ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసిందని ఆ దాడుల్లో బాలకోట్‌లోని జైషే మహ్మద్ స్థావరం కూడా నామరూపాల్లేకుండా పోయిందని, ఈ వైమానిక దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అన్నారు. భారత్‌పై యుద్ధం చేస్తామని ప్రకటించిన పాకిస్థాన్, ఆ తర్వాత ఏమీ చెయ్యలేక సైలెంటయ్యిందని అన్నారు. ఈ విషయంలో అమెరికా సహా ప్రపంచ దేశాలు భారత్‌కి అండగా నిలిచాయని, దాంతో పాకిస్థాన్ ఆటలు సాగలేదని అన్నారు.

ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వీర జవాన్లకు రాజ్యసభ సభ్యులు GVL నరసింహారావు, బీజేపీ సీనియర్ నాయకులు SVS ప్రకాష్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమ్మిడి సుజాత రాజ్, వల్లూరి మోహన్ రావు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతాడ మోహన్ రావు, తదితరులు నివాళులర్పించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles