16వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక వ్యతిరేక సమ్మెను జయప్రదం చేయండి ఏఐటీయూసీ పడాల రమణ

by vvwnews.com

*దేశ వ్యాపిత సమ్మెను జయప్రదం చేయండి*
————
*AITUC రాష్ట్రకార్యదర్శి పడాల రమణ*
—————–
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 16 న జరిగే దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ కార్మిక వర్గానికి పిలిపునిచ్చారు. ఈరోజు ఇసుకతోట లో ఉన్న ఏఐటియుసి కార్యాలయంలో వాలడా జనార్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశం సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమణ మాట్లాడుతూ…. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయిందని ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మికులకు , కర్షకులకు , ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని పడాల రమణ అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి మోడీ ప్రభుత్వం హామీని అమలు చేయలేదని అన్నారు. కేంద్ర బిజెపి మోడీ సర్కార్ కార్పొరేట్ , మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలందరికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం ఎన్నికలలో భారత్ వెలిగిపోతుంది, అచ్చేదిన్ ఆయేగా , విశ్వగురు , ఆత్మ నిర్భర్ భారత్ , మేకి ఇన్ ఇండియా వంటి మోసపురిత హామీలు ఇచ్చినా ఏమీ ఓరగలేదని అన్నారు, బీజేపీ హయాంలో నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని , కార్మికుల వేతనాలు 20% తగ్గిపోయాయని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా నెలకు ఐదువేల రూపాయల పెన్షన్ అందించాలని ,గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని , 2021 లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 5 కనీస వేతనాల జీవోలకు గెజిట్ ఇచ్చి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ పట్టణాలకు విస్తరించాలని , స్కీం వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని , కనీస వేతనం 26 వేల రూపాయలూ ,కార్మికులు పోరాడి సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని , కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల సమగ్ర సంక్షేమ చట్టం మరియు బోర్డును ఏర్పాటు చేయాలని . కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని ,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని , అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు
. అసంఘటితరంగ కార్మిక వర్గానికి సామాజిక భద్రత చట్టాన్ని తీసుకురావాలని , ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు.
అందుకై ఏఐటియుసి తో 11 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల య16 న జరిగే సమ్మె ను జయప్రదం చేయాలని ఆయన విఙ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఏఐటీయూసీ అధ్యక్షులు వాలడా. జనార్ధన్ కార్యదర్శి గండ్రెడ్డి సతీష్ ఏ రామారావు డి రమణ సోమ నాయుడు. గంగు నాయుడు వై నాగరాజు ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles