తెలుగు దండు పొలి కేక ప్రారంభం రాజకీయ ప్రారంభం

by vvwnews.com

*విలేఖరులకు ఆహ్వానం*

గౌరవనీయ.. ప్రచార ప్రసార మాధ్యమాల పెద్దలకు, మిత్రులకు నమస్కారం..!

“తెలుగుదండు పొలికేక” రాజకీయ అరంగేట్రం..పాత్రికీయ సమావేశానికి మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాము.

*తేదీ: 14-02-2024, బుధవారం.*
*సమయం: ఉదయం 10గం.లకు*.
*వేదిక: విజెఎఫ్ ప్రెస్ క్లబ్*
*డాబాగార్డెన్స్,విశాఖపట్నం.*

మీ ఆదరాభిమానాలతో.. పదేండ్లుగా తెలుగుభాష రక్షణ కోసం పోరాడుతున్న “తెలుగుదండు” ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి సిద్ధమైంది. “తెలుగుదండు పొలికేక”గా ప్రజా ఉద్యమం ప్రారంభిస్తోంది.

ఈ ఉద్యమంలో భాగంగా.. పరవస్తు ఫణిశయనసూరి(తెలుగుదండు సూరి) అను నేను.. మన విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గము నుంచి.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. ఆయా వివరాలను మీకు తెలియజేయుటకు, మీ మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ విన్నవించుటకు..ఈ సమావేశం ఏర్పాటు చేశాము. మీరు తప్పక విచ్చేసి..ఈ సంకల్పాన్ని జయప్రదం చేయుటకు మీ సహాయ సహకారాలు అందించగలరని ప్రార్థన.

ధన్యవాదాలతో.. భవదీయుడు ౼సూరి.
వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగుదండు.

Use Social Media to Spread the Word about Our News

related articles