INTERNATIONAL DALIT MEDIA DAY

by vvwnews.com

**మీడియా సామాజిక మార్పు కోసం పని చేయాలి**
అంతర్జాతీయ దళిత మీడియా డే కార్యక్రమంలో ప్రొఫెసర్ కె. ఎస్. చలం.
అంబేద్కర్ స్థాపించిన మూక్ నాయక్ పత్రికకు 104 ఏళ్ళు

విశాఖపట్నం, ఫిబ్రవరి12:మీడియా సంస్థలు సామాజిక మార్పుకు బాధ్యతమైన పాత్ర పోషించాలని యూపీఎస్సీ మాజీ సభ్యుడు, ద్రావిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.యస్.చలం అన్నారు. నగరంలోని డాబా గార్డెన్స్ లో గల అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ దళిత మీడియా డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అంబేద్కర్ స్థాపించిన మూక్ నాయక్ పత్రిక స్థాపన దినాన్ని ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్టుల నెట్వర్క్ (ఐడిజెఎన్) అంతర్జాతీయ దళిత మీడియా డే ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి అతిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భగా ప్రొఫెసర్ చలం మాట్లాడుతూ బానిసకు నీవు బానిసవును చెబితే వారి బానిస సంకెళ్ళను వారే తెంచుకుంటారని అంబేద్కర్ బోధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.సమాజం అనేక కులాలుగా, మతాలుగా చీలిపోయిందని అణగారిన వర్గాల హక్కులపై దాడి జరుగుతున్న నేపథ్యంలో వారికి తోడుగా నిలబడాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. భారత రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛలో మీడియా భాగం చేసి అత్యంత ఉన్నతమైన స్థానాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చారన్నారు. కానీ ఆచరణలో దానికి విరుద్ధంగా జరుగుతుందని పేర్కొన్నారు సేవారంగంగా ఉండాల్సిన మీడియా వ్యాపార రంగంగా మారిపోయిందని దేశంలో 10 లక్షల కోట్ల వ్యాపారం తన చుట్టూ సాగుతుందన్నారు. కొన్ని మీడియా సంస్థలు అధిపత్య కులాల రాజకీయాలు, ఆర్థిక ప్రయోజనాల లక్ష్యంగానే పనిచేస్తున్నాయని మండి పడ్డారు. అలాంటి పరిస్థితిని ముందే ఊహించిన అంబేద్కర్ మీడియాలోకి కార్పొరేట్ పెట్టుబడి రాకూడదని ఆనాడు చెప్పారన్నారు .దాని ప్రత్యేకంగా దళిత బహుజనులకు అండగా నిలబడే లక్ష్యంతో ముక్కు నాయక్ పత్రికను 104 కిందట స్థాపించారని పేర్కొన్నారు ఆ తర్వాత కాలంలో బహిష్కృత భారత్, జనతా, సమత, ప్రభుద్ధ భారత్ పత్రికలను స్థాపించి ప్రత్యామ్నాయ మీడియాను తెచ్చారన్నారు. భారతదేశంలో తొలి పత్రికను తమిళనాడులో ఆయితీదాస్ ప్రారంభించారని చెప్పారు. అన్ని రంగాలతో పాటు మీడియా రంగంలో దళిత బహుజనుల వాటాను డిమాండ్ చేయాలన్నారు. ఏ పత్రికల్లో ,ఏ ఛానల్ లో ఏమొస్తుందో చెప్పే విధంగా న్యూస్ వాచ్ కూడా అవసరమని క్రిటికల్ గా ఉండాలన్నారు. గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ సి. ప్రజ్ఞ మాట్లాడుతూ పత్రికలు లేని ఉద్యమం లెక్కలులేని పక్ష లాంటిదని భావించి అంబేద్కర్, ఫూలే పెరియార్ లాంటి వారు అనేక పత్రికలను ఆనాడే నడిపారన్నారు. అంటరానితనం అణచివేత, అన్ని రకాల అసమానతలు తొలగింపుకు పత్రికలు , ఇతర మీడియా సంస్థలు పనిచేయాలని పేర్కొన్నారు. అంబేద్కర్104 వేళ్ళ క్రిందట స్థాపించిన మూక్ నాయక్ పత్రిక అణగారిన వర్గాల గొంతుగా ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టీ .నానాజీ (నాని) మాట్లాడుతూ ఐడిజేఎన్ మూక్ నాయక్ పత్రిక స్థాపక దినాన్ని ఐటిజేఎన్ అంతర్జాతీయ దళిత మీడియా డే ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా దళిత బహుజనుల హక్కులను వాటికి మీడియా అండగా నిలబడాల్సిన కర్తవ్యాన్ని ప్రచారం చేయనుందన్నారు. మీడియాలో దళిత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంపుదల, ఆర్థిక పురోగతి, కుల నిర్మూలన లక్ష్యం కోసం దళిత, బహుజనులకు అండగా నిలబడాలని లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పి. సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు స్థలాలు నిమిత్తం విడుదల చేసిన జీవో నెంబర్ 535ను సవరించి 60:40 నిష్పత్తిలో ఉన్న ధర బదులుగా ఉచితంగానో లేదా నామ మాత్రపు ధరకు జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలన్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించాలంటే కనుక ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాను నిధుల నుండి ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు ఆ మొత్తాన్ని చెల్లించి వారికిఉచితంగా ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు..రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న యాడ్స్ బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీలు నడుపుతున్న పత్రికలు ఇతర మీడియా సంస్థలకు తగినంత బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సమాచార, పౌర సంబంధాలు శాఖలో ఉన్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలోరిజర్వేషన్ విధానాన్ని పాటించి సీనియర్ దళిత జర్నలిస్టులతో వాటినిభర్తీ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా అతిథులను సత్కరించి అంబేద్కర్ చిత్రపటం కలిగిన మెమెంటో వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ రావు, డి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జే.వి. ప్రభాకర్, భీమ్ సేన వార్ ప్రధాన కార్యదర్శి వి. రాజేంద్రప్రసాద్, దళిత హక్కుల సమాఖ్య అధ్యక్షుడు కొత్తపల్లి వెంకటరమణ, భీమ్ సేన ప్రధాన కార్యదర్శి ఎం. రవి సిద్ధార్థ, సీనియర్ జర్నలిస్టు, సినీ నటుడు కారెం వినయ్ ప్రకాష్ తదితరులు ప్రసంగించారు. ఐడిజెఎన్ ప్రతినిధులు కె .చంద్రమోహన్, యు.వి. రావు. కోన ప్రకాష్, వై. బాలకృష్ణ, రాజీవ్ గాంధీ, కిరణ్, జార్జి, ఆంజనేయులు, ఎం.డి. రాజు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles