ఉత్తర నియోజకవర్గం 55వ వార్డులో మహానాడు వేడుకలు #vvwnews

by vvwnews.com

తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉత్తర నియోజకవర్గం 55వ వార్డులో మహానాడు వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గాల్లోని క్లస్టర్ పరిధిలో ఈ వేడుకలను నిర్వహించుకోవాలని పార్టీ పిలుపునివ్వడంతో, గత రెండు రోజులుగా కార్యకర్తలు, కన్వీనర్లు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మహానాడులో భాగంగా రెండవ రోజు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత మాట్లాడుతూ.. మహానాడును వార్డు స్థాయిలో నిర్వహించే భాగ్యాన్ని కల్పించినందుకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, స్థానిక ఎంపీ శ్రీభరత్, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పేద మహిళలకు చీరలు, పండ్లను పంపిణీ చేశారు. స్థానిక పిల్లల చేత సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, బూత్ కన్వీనర్లు, మహిళా కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles