గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్
( సి.ఐ.టి.యు. అనుబంధం)
0.50.4/1877/2001
డోరు నెం. 28-6-8, ఎన్.పి.ఆర్. భవన్, యల్లమ్మతోట, జగదాంబ జంక్షన్, విశాఖపట్నం- 20.
໖໖: 9490098805, 9502595180, 9966748686, 9848990805
5. అధ్యక్షులు: పి. వెంకట రెడ్డి
ప్రధాన కార్యదర్శి : ఉరికూట్ రాజు
19న కమిషనర్ గారితో చర్చలు ఫలవంతం కాకపోతే నిరవధిక సమ్మె తప్పదు.
సిఐటియు హెచ్చరిక.
గతంలో కార్మికుల డిమాండ్లపై కమిషనర్లు అంగీకరించిన ఒప్పందాలను నిర్దిష్ట గడువులోగా అమలు చేయకుంటే నిరవధిక సమ్మె తప్పదని జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) హెచ్చరించింది. కొత్త కమిషనర్ శ్రీ కేతన్ గార్డ్ గారు ఒప్పంద మినిట్సు ను అమలు చేస్తారని ఆశించామని, వైసిపి, టిడిపి పాలకవర్గాలు కార్మికులను మోసం చేశాయని, కౌన్సిల్లో చేసిన తీర్మానాలు నీటి సరఫరా, వెటర్నరీ, పార్కులు, రిటైర్డ్, కారుణ్య నియామకాలు, లోడర్ల వేతనాలు అమలు చేయలేదని, ఇన్చార్జి కమిషనర్ (జిల్లా కలెక్టర్ శ్రీ నరేంద్ర ప్రసాద్) గారితో తేదీ: 02-05-2025న జరిగిన ఒప్పందాన్ని కూడా అమలు చేయలేదని, ఆఖరికి జీవీఎంసీ వద్ద ఉన్న కార్మికుల కష్టార్జితం హెల్త్ అలవెన్స్ బకాయిలు, విలీన కార్మికుల పి.ఎఫ్ సొమ్ము సప్లిమెంటరీ కార్మికుల జీతాలు బిల్లు, ఇన్కమ్ టాక్స్ సొమ్ము, 333 జీవో ఏరియర్స్ చెల్లించలేదు. లోడర్లు, బదిలీ, కాంట్రాక్టు, ప్యాకేజీ, డైలీ వేజ్ కార్మికులకు జీవో వేతనాలు, పి.ఎఫ్., ఈఎస్ఐ. సెలవులు ఇవ్వకుండా గొప్పగా చెప్పుకుంటున్న మహానగరపాలక సంస్థ కేవలం రోజు చెత్త కంపులో పనిచేస్తున్న వారికి కూలీగా 450/- రూ:లు ఇచ్చి బానిసలుగా పని చేయించుకుంటున్నది. ఇది సరైనది కాదు. వీరికి 3 నుండి 4 నెలలుగా జీతాలు చెల్లించక పోతే ఎలా బ్రతకగలరని ప్రశ్నించారు. విలీన కార్మికులకు ” మినిమం టైమ్ స్కేలు” ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా అమలు చేయలేదని, డెత్, రిటైర్డ్ కార్మికుల బిడ్డలకు ముందుగా ఉపాధి కల్పించకుండా బయట వ్యక్తులను తీసుకోవడం వలన పోస్టులు అమ్ముకుంటున్నారని కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. అవినీతి జరిగిందని ఇప్పుడు కమిషనర్ గారు చర్యలకు ఆదేశాలు ఇవ్వడం అంటే ” చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందన్నారు. ఇప్పటికైనా నిరవదిక సమ్మె నివారణకు శ్రీ కమీషనర్ గారు గతంలో అంగీకరించిన వాటిని నిర్దిష్ట కాల పరిమితి లో అమలుకు చర్యలు తీసుకోవాలని, లేనిచో 21-05-2026 తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళతామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. ప్రెస్ మీట్ లో యూనియన్ గౌ” అధ్యక్షులు పి. వెంకటరెడ్డి, అధ్యక్షుడు టి. నూకరాజు, ప్రధాన కార్యదర్శి యు. రాజు, వర్కింగ్ జనరల్ సెక్రటరీ ఎం వి ప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ జి. అప్పారావు, ఉపాధ్యక్షులు నాయుడు, నీటి సరఫరా నాయకుడు కే. వెంకట్రావు, యూజీడి నుండి ఆదినారాయణ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
పి. వెంకటరెడ్డి గౌరవ అధ్యక్షులు
టీ. నూక రాజు అధ్యక్షులు
ఉరుకుటి రాజు ప్రధాన కార్యదర్శి