మూడు చోరీలకు పాల్పడిన యువజంట అరెస్ట్
యాంకర్ వాయిస్..
వ్యసనాలకో,అవసరాలకోసమో ఒక యువజంట వరుస దొంగతనాలకు పాల్పడ్డారు.చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
పోలీసులకు అందిన సమాచారం మేరకు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో అనకాపల్లి తుమ్మపాల గ్రామం ఏలూరు కెనాల్ జంక్షన్ వద్ద స్కూటీ మీద వెళ్లి పోతున్న ఒక యువ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం
అనకాపల్లి డిఎస్పీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు టౌన్ సిఐ ప్రేమ్ కుమార్ నేతృత్వంలో ఈ చోరీ కేసును చేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. మూడు దొంగతనాల్లో కలిపి రాబరీకి గురైన బంగారం 106.340,వెండి ఒకటి 148.30,నగదు 3500 స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దొంగతనానికి పాల్పడిన నిందితులలో కాండ్రేగుల లోకనాథ్ వీర సాయి శ్రీనివాస్ (లోకేష్) డ్రైవర్ గాజువాక వడ్లపూడి కి చెందినవాడు. మరొకరు గెద్దాడ మేరీ యాంకర్ చోడవరం నియోజకవర్గం ముత్తుర్తి గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం లోకేష్ తో కలసి ఆర్ హెచ్ కాలనీ కణితి వడ్లపూడి గాజువాక లో ఉంటున్నారు. వీరిపై 22వ తేదీన పట్టణంలోని గాంధీనగరం లో చేసిన దొంగతనంపై టౌన్ పోలీస్ స్టేషన్ లోనూ, అదే రోజు రాత్రి రూరల్ స్టేషన్ పరిధిలో పిసినిగాడ గ్రామంలో చేసిన దొంగతనంపై రూరల్ పోలీస్ స్టేషన్లోనూ, గతంలో చోడవరం కోటవీధిలో చేసిన దొంగతనంపై చోడవరం పోలీస్ స్టేషన్ లోనూ కలిపి మూడు కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. లోకేష్ కు దువ్వాడ పోలీస్ స్టేషన్ లో రెండు గంజాయి కేసులు ఒక కొట్లాట కేసులో అరెస్టై దువ్వాడ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ , పిడి యాక్ట్ కూడా ఓపెన్ చేయబడిందని వెల్లడించారు. ఈ యువ జంటను కోర్టుకు హాజరపరిచి రిమాండ్కు తరలిస్తామని అన్నారు.