​శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామివారి చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లుసిద్ధం.కలెక్టర్ అభిషిక్త్ కిషోర్

by vvwnews.com

​శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు:
భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు.

చందనోత్సవానికి సర్వం సిద్ధం.

కలెక్టర్: అభిషిక్త్ కిషోర్.

​విశాఖపట్నం/సింహాచలం.
ఏప్రిల్ 18.

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన చందనోత్సవం వేడుకలకు జిల్లా యంత్రాంగం, దేవస్థానం మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన సింహాచలం దేవస్థానం లో చందనోత్సవం ఏర్పాట్లను GVMC కమిషనర్, జాయింట్ కలెక్టర్ ఉద్యాధరీ , VMRDA కమిషనర్ తేజ్ భరత్,EO J. వెంకట రావు తో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
చందనోత్సవం రోజున తెల్లవారుజామున 4 గంటలకు తొలి పూజ అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం 6:00 గంటల కల్లా దర్శనాల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
​ ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ₹300, ₹1000 మరియు ₹1500 కేటగిరీలలో సుమారు 40,000 టికెట్లను విక్రయించడం జరిగిందాని, మిగిలిన భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నామని వెల్లడించారు.
కొండ పైకి భక్తులను తరలించడానికి 100 ప్రత్యేక బస్సులను ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు . ప్రైవేట్ వాహనాలను కొండ పైకి అనుమతించమని. భక్తులు తమ వాహనాలను ఫుట్ హిల్స్ వద్ద కేటాయించిన 32 పార్కింగ్ ప్రదేశాలలో నిలిపివేసి, దేవస్థానం బస్సుల ద్వారా కొండ పైకి చేరుకోవాలని కోరారు.
​ భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ల దూరాన్ని తగ్గించారనీ,. ఎండ, వానల నుండి రక్షణ కోసం క్యూ లైన్ల పొడవునా( కెనోపి )నీడ (Canopy) ఏర్పాటు చేశా మ న్నారు .తిరుమల, విజయవాడ దేవస్థానాల నుండి వచ్చిన అనుభవజ్ఞులైన సిబ్బందితో క్యూ లైన్లను వేగంగా కదలడానికి చర్యలు చేపట్టామన్నారు.
భక్తులు తమ మొబైల్ ఫోన్లను కొండ పైకి తీసుకురావడానికి అనుమతి లేదన్నారు. భక్తులు తమకు కేటాయించిన నిర్ణీత సమయ స్లాట్ (Slot) లలోనే దర్శనానికి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నకిలీ టికెట్ లు తెస్తే చట్టపరంగా చర్యలు తీసు కుంటామన్నారు.
​ భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన షెడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు మరియు రాంపులను నిర్మించా మన్నారు .
ఉచిత ప్రసాదం, మంచినీరు మరియు అన్నదాన వితరణ చేసే సంస్థలకు ప్రత్యేక డ్యూటీ పాస్‌లను జారీ చేశామని తెలిపారు..
ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన అతి కొద్ది మందికి (సుమారు 500 మందికి) మాత్రమే ఉదయం 5:00 గంటల లోపు అంతరాలయ దర్శనానికి అనుమతి ఉంటుందనీ. ఆ తర్వాత అందరికీ సాధారణ దర్శనాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
​జిల్లా యంత్రాంగం, పోలీస్ మరియు దేవస్థానం సిబ్బంది ఒకే టీమ్‌గా పనిచేస్తూ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని, భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు.

​జారీ:
సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కార్యాలయం, విశాఖపట్నం.

Use Social Media to Spread the Word about Our News

related articles