అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మెగా ఫైర్ సర్వీస్ డెమో*

by vvwnews.com

*అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మెగా ఫైర్ సర్వీస్ డెమో*

*ఆకట్టుకున్న మెగా ఫైర్ సర్వీస్ డెమో*

*అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి*.

*అత్యాధునిక పరికరాలు , టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం*

*ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఫైర్ సిబ్బంది విధులు నిర్వహణ*

*పరిశ్రమల్లో చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగకూడదు*

*ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి*…*హోం మంత్రి అనిత*

విశాఖపట్నం, ఏప్రిల్ 18:-జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా విశాఖలోని ఆర్‌కే బీచ్ వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫైర్ సర్వీసెస్ విభాగానికి చెందిన డైరెక్టర్ పి.వి. రమణ, డైరెక్టర్ (అడ్మిన్) మురళి పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన మెగా ఫైర్ సర్వీస్ డెమో అతిథులు, నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది పోషించే కీలక పాత్రను అధికారులు వివరించారు. అలాగే వారోత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను హోం మంత్రి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అగ్ని ప్రమాదాల సమయంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను డెమోల ద్వారా వివరించామని చెప్పారు. 2018లో అగ్నిమాపక శాఖకు పరికరాలు కొనుగోలు చేశామని, 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం ఈ విభాగాన్ని పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. తాజాగా రూ.232 కోట్లతో ఫైర్ వాహనాలను కొనుగోలు చేశామని, వాటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారని వెల్లడించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఎక్కడైనా విపత్తు సంభవించినప్పుడు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని ఆమె ప్రశంసించారు. హుద్‌హుద్ తుఫాను సమయంలో అలాగే విజయవాడలో బుడమేరు ఘటనలో కూడా ఫైర్ సిబ్బంది చేసిన సేవలను గుర్తు చేశారు.
పరిశ్రమల్లో చిన్నపాటి ప్రమాదాలు కూడా జరగకూడదని, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫైర్ సిబ్బందికి అన్ని రంగాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమం ముగింపులో వివిధ విభాగాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించిన వారిని హోం మంత్రి సత్కరించారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులు హోం మంత్రి అనితను ఘనంగా సత్కరించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles