రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ #vvwnews #news #ytshorts #latestnews

by vvwnews.com

*🔥 ప్రజల గొంతుకగా ముందుకు – కూటమి వైఫల్యాలపై ఘాటు స్వరం*

*📍 నెల్లిమర్ల నియోజకవర్గం | డెంకాడ మండలం | పెద్దతాడివాడ | 05 ఏప్రిల్ 2026:*

ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారమే నిజమైన నాయకత్వమని, గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి నాయకుడు బాధ్యతగా ముందుకు రావాలని *ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు* పేర్కొన్నారు.

నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెద్దతాడివాడలోని దంతులూరి వెంకట సింహాద్రి రాజు కల్యాణ మండపంలో మాజీ శాసనసభ్యులు బడుకొండ అప్పలనాయుడు గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం బడుకొండ ప్రదీప్ నాయుడు గారు, బడుకొండ మణిదీప్ నాయుడు గారి పర్యవేక్షణలో ఘనంగా జరిగింది.

🎤 ఈ సందర్భంగా చిన్నశ్రీను గారు మాట్లాడుతూ:

✔️ ఐదేళ్లు సర్పంచులుగా, నగర పంచాయతీ చైర్మన్‌లుగా, కౌన్సిలర్లుగా ప్రజలకు సేవలందించిన మీ అందరిని అభినందించారు
✔️ వైఎస్ఆర్‌సిపి పాలనలో మూడు సంవత్సరాలు, కూటమి పాలనలో రెండు సంవత్సరాలు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు
✔️ ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి అండగా నిలిచిన నాయకులను ప్రత్యేకంగా అభినందించారు
✔️ ప్రజల తలలో నాలుకగా ఉండి నిరంతరం సేవ చేయాలని సూచించారు

🟢 వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, బొత్స సత్యనారాయణ గారి మార్గదర్శకత్వంలో జిల్లా పార్టీ తరఫున ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

🔥 రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల గొంతుకగా నిలవాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

⚠️ నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావడం ఉత్తరాంధ్ర చరిత్రలోనే తొలిసారి అని విమర్శించారు.
⚠️ కూటమి పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
⚠️ మొక్కజొన్నకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర అమలు కాకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

📢 రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో సమస్యలతో పోరాడుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం బాధాకరమని తెలిపారు.
👉 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి కుప్పకూలడం ఖాయమని అన్నారు.

👥 ఈ కార్యక్రమంలో:
ఎమ్మెల్సీ పెన్మత్స సురేష్ బాబు గారు, పార్లమెంట్ పరిశీలికులు కిల్లి సత్యనారాయణ గారు, నియోజవర్గ పరిశీలికలు నెక్కల నాయుడు బాబు గారు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles