ప్రెస్ నోట్ స్వయం ఉపాధి పథకం కింద జీవిస్తున్న ఆటోలు టాటా మ్యాజిక్ వ్యానులు జీపులు ఉన్న పాత పోలీస్ ఆర్టీవో ఈ చలానా రద్దు చేసి డ్రైవర్లకు 2026 వాహన మిత్ర వెంటనే ఇవ్వాలి జీ వామన మూర్తి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు 2026 వాహన మిత్ర వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తేదీ 3-4- 2026 ఉదయం 11:30 కి అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట జంక్షన్ లో ఆటో డ్రైవర్ల ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన డీజలు పెట్రోలు వంట గ్యాస్ నిత్య అవసర వస్తువుల ధరలు తగ్గించి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని కోరారు పాసెంజర్ మినీ వ్యాన్లు జీపులు కార్లకు గ్రీన్ టాక్స్ రద్దు చేయాలని భారీగా పెంచిన టోల్ ప్లాజా 30 శాతానికి తగ్గించి డ్రైవర్లకు 2026 వాహన మిత్ర వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జరిమానాలపై జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని డ్రైవర్లకు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని అనారోగ్యంతో చనిపోయిన డ్రైవర్లకు 2 లక్షలు ప్రమాదంలో మరణించిన డ్రైవర్ 5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు మోటార్ వాహనాల ఎఫ్ సి డ్రైవింగ్ లైసెన్స్ లు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దుచేసి ప్రభుత్వమే ఎఫ్ సి డ్రైవింగ్ లైసెన్స్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో నూకరాజు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి వామనుమూర్తి
స్వయం ఉపాధి పథకం కింద జీవిస్తున్న ఆటోలు టాటా మ్యాజిక్ వ్యానులు జీపులు#vvwnews
by vvwnews.com
written by vvwnews.com
3
previous post