జైశ్రీరామ్
కళాభారతి అధ్యక్షులు, పాత్రికేయ మిత్రులు ఈరోజు కళాభారాతిలో 78 ఏళ్ల వయస్సులో, Ph. D పొందిన Dr. రాంబాబుకు ఘనంగా సన్మానం.
చదువుకి వయస్సు పరితము లేదు.
78 ఏళ్ల వయసులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం నూరు వసంతాల ఉత్సవంలో జరిగిన స్నాతకోస్తవంలో కళాభారతి కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరి రామకృష్ణ ప్రసాద్ “కళాభారతి రాంబాబుగా” పేరుగాంచిన వారికి పీహెచ్డీ పట్టా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు.
కరోనా టైములో కాలం వృధా చేయకుండా సింహాచల దేవస్థానం పై కూలంకుషంగా పరిశోధన చేసి పరిశోధన గ్రంథాన్ని యూనివర్సిటీకి సబ్మిట్ చేసినందుకు పీహెచ్డీ అవార్డు ఇవ్వడం జరిగింది. నాకు ఆచార్య మోహన వెంకటరామ్, గైడ్, అన్ని విధాల సూచనలు సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు.
జీవితంలో ఐపీఎస్ అవ్వాలని, కానీ దైవ నిర్ణయం కళలకు అంకితం అవ్వాలని.
“IPS కల – కళ” గా మారింది.
జీవితంలో వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని తదనుగుణంగా ప్రయాణం సాగించి విజయం పొందాలే గాని, అనుకున్నది జరగలేదని నిరుత్సాహపడి నీరసపడిపోకూడదు అన్నది ఈ దాసుడు ప్రధమ ఉద్దేశం.
విజయనగరం మహారాజా కాలేజీలో చదివి దేవస్థానం శత్రంలో భోజనం చేసి తర్వాత బొంబాయిలో ఉన్నత చదువులు చదువుకొని, 1977లో విశాఖపట్నం వచ్చి నిర్మాణ రంగంలో జనరల్ మేనేజర్ గా పనిచేసి అక్కడ విజయం సాధించడం శ్రీరామానుగ్రహమే.
2005 వరకు 11 సంవత్సరాలు క్రీడారంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, 23 దేశాలు పర్యటించి 11 అంతర్జాతీయ క్రీడా పోటీలలో ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ గాను, అలాగే న్యాయ నిర్నేతగా విధులు నిర్వహించి క్రీడారంగంలో కూడా అత్యంత ఉన్నత స్థాయికి చేరుకోవడం కూడా శ్రీరామానుగ్రహమే.
2008 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ద్వారా అనేక గోవింద కళ్యాణాలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి అందులో కూడా విజయం సాధించడం కూడా శ్రీరామా అనుగ్రహమే.
వాల్మీకి రామాయణం 24000 శ్లోకాలు,108 సార్లు పారాయణ చేసి 2022లో కాశీలో ఏడు రోజులు రామాయణ హవన సమేతంగా గొప్ప క్రతువు నిర్వహించి మా దంపతులం చరితార్థులు అవ్వడానికి కారణం కూడా శ్రీరామా అనుగ్రహమే కదా.
ఇదే కారణం ఏమో అనుకుంటాను 2018లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం అందుకున్నాను.
1988లో కళాభారతి వ్యవస్థాపకులు శ్రీ సుసర్ల సూర్య భగవత్ శంకర శాస్త్రి గారి స్థానంలో ట్రస్టీగా చేరి నేటికీ అనేక సంగీత,సాహిత్య, నాటక, నృత్య ఇంకా ఇతర కళల కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తూ “సత్ సంకల్పం” ఉంటే వయస్సు దేనికి అడ్డురాదు అని నిరూపించారు. అందుకుకూడా శ్రీరామానుగ్రహమే కారణం.
అంతేకాకుండా చిన్నప్పుడు నేర్చుకున్న సంగీత జ్ఞానాన్ని నెమరు వేసుకుంటూ ఇప్పుడు కూడా త్యాగరాజ ఉత్సవాలలో గాత్రం కచేరీ చేయగలగడం కూడా కేవరం శ్రీరామానుగ్రహమే కదా
అతి త్వరలోనే డిలీట్ కూడా చేయాలని చేస్తానని నేటి తరానికి వయస్సు ఒక నెంబర్ మాత్రమేనని ప్రతి మనిషి జీవితాంతం నేర్చుకోవాల్సింది ఉంటుందని, నిత్య విద్యార్థి అని తెలియజేశారు.
మా ఇంట్లో నా భార్య డాక్టర్ జి ఇందిరా పిహెచ్డి, డిలీట్ కూడా చేశారు. అలాగే నా కుమార్తె Dr. కృష్ణ శ్వేత,మెడికల్ డాక్టర్ PG కూడా చేసింది.
కుమారుడు ఇంజనీర్ కెనడాలో ఉన్నాడు. అతన్ని కూడా పీహెచ్డీ చేయ మని ప్రోత్సహిస్తున్నాను.
దీనివల్ల సంకేతం ఏమిటి అంటే ఏ పని చేసినా, టైం లేదు అని అనుకున్నా, సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని తెలుసుకోవచ్చు.