సమస్త జీవరాశినీ కాపాడే బాధ్యత మానవాళి దే #vvwnews

by vvwnews.com

సమస్త జీవరాశినీ కాపాడే బాధ్యత మానవాళి దే
– పిచ్చుకల పరిరక్షణ బాధ్యత మనదే
– పశుపక్ష్యాదుల కోసం వేసవిలో నీరు అందుబాటులో ఉంచండి
– ప్రకృతి తో మమేకమై జీవించుదాం
– ఎన్ రామచంద్ర రావు, డిఎఫ్ఒ, కాకినాడ
సమస్త జీవరాశినీ కాపాడే బాధ్యత మానవాళిదే అని కాకినాడ డిఎఫ్ఒ ఎన్, రామచంద్ర రావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కాకినాడ లోని శ్రీ విద్యా కాలనీ లోని ఎకొ ప్లాంట్ నర్సరీ అండ్ గార్డెన్ మార్ట్, విశాఖ కు చెందిన గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ ల నేతృత్వంలో ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుపక్ష్యాదుల కోసం వేసవిలో నీరు అందుబాటులో ఉంచండి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి తో మమేకమై జీవించుదాం అన్నారు. ప్రతి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు తప్పకుండా తాను సహకారం అందిస్తాం అన్నారు.
స్వచ్చాంధ్ర కార్పోరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ సమస్త జీవరాశినీ కాపాడటమే మానవత్వం అన్నారు. జీవజాతులు లో ఏది అంతరించినా మానవాళికి పెనున‌ష్టం జరుగుతుంది అన్నారు.
జెఎన్ టియుకె విశ్రాంత ఉపకులపతి కెవిజి మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రకృతివనరుల పరిరక్షణకు ప్రకృతి కార్యశాలలు నిర్వహించడం అవసరం అన్నారు. హరిత వందనాలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.
పక్షి ప్రేమికులు కె మృత్యుంజయ రావు మాట్లాడుతూ భూమి మీద ఏ జీవికూడా అంతరించరాదన్నారు. వలస పక్షుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉదయం ముందుగా బియ్యం పిండి తో మహిళలు ముగ్గులు వేసారు, ధాన్యం కంకులతో కుచ్చులు తయారీ విధానం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ ప్రతినిధి రాజేశ్వరి మహిళలకు నేర్పారు. పలువురు మహిళలు పిచ్చుకల తో ఉన్న దుస్తులు ధరించారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, ఎపి నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల చలపతి రావు, ఎకొ ప్లాంట్ నర్సరీ అండ్ గార్డెన్ మార్ట్ ప్రతినిధి బి రామారావు, పర్యావరణ ప్రేమికులు బాలాజీ కిషోర్, మేంగొ మేన్ అప్పాజీ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, లైన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles