కిడ్నీ వ్యాధులపై ప్రజలకు అవగాహన అవసరం #vvwnews

by vvwnews.com

కిడ్నీ వ్యాధులపై ప్రజలకు అవగాహన అవసరం

రంగోళీ పోటీలు నిర్వహించిన
ఏఐఎన్‌యూ ఆసుపత్రి

విశాఖసిటీ,మార్చి15(ఆంధ్రప్రభ): ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్బంగా అసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రజల్లో కిడ్నీ ఆరోగ్యంపై పెంచాలనే ఉద్దేశ్యంతో

ఉద్యోగులకు రంగోళీ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా కిడ్నీ వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు,క్రమం తప్పని అరోగ్య పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ రంగోళీ పోటీల్లో

మహిళలు ఉత్సాహంగా పాల్లొని కిడ్నీ ఆరోగ్యం,జీవనశైలిలో మార్పులు ప్రతిబింబించేవిధంగా ఆకర్షణీయమైన రంగులతో ముగ్గులు వేశారు. తమ సృజనాత్మకతతో కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర వర్మ

డాక్టర్ వైష్ణవి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులు ప్రారంభ దశలోనే గుర్తించి లక్షణాలు లేకుండానే అభివృద్ధి చెందుతాయన్నారు.క్రమం తప్పకుండా అరోగ్య పరీక్షలు చేయించుకోవడం, తగినంత నీరు తాగడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడవచ్చునన్నారు. దేశంలో రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలో ముందుందే సంస్థగా ఏఐఎన్‌యూ ఇప్పటికే వరకు ఆరు లక్షలకుపైగా రోగులకు చికిత్స అందించి 1400కిపైగా రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. డిమ్‌సి, ఎఫ్‌ఎన్‌బి వంటి పోస్ట్ గ్రాడ్యువేట్ వైద్యశిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహబత్తున్నట్లు, ప్రతిష్టాత్మక తెలివైన ప్రత్యేక వైద్యనిపుణులు, నూతన
అవిస్కరణల ద్వారా ఆరోగ్యరంగంలో ఉన్నత ప్రమాణాలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నెఫ్రాలజిస్టులు డాక్టర్ ఉదయ్‌దీపక్రావ్ గాజులే,

Use Social Media to Spread the Word about Our News

related articles