– పిచ్చుకలు గూడు పెట్టె గడ్డి ని కాపాడుకోవాలి
– పశుపక్ష్యాదులు కోసం నీరు అందుబాటులో ఉంచాలి
– కలుపు తీత రసాయనాలు నిషేధించాలి
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
బంగారు పిచ్చుకల పరిరక్షణకు కృషి చేయాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సబ్బవరం మండలం లోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యా సంస్థలో గ్రీన్ క్లైమేట్ టీం, పీపుల్స్ పవర్ ఎన్జీఒలతొ కలిసి ప్రిన్సిపాల్ సి హెచ్ కేశవరావు అధ్యక్షతన నిర్వహించిన పిచ్చుకల పరిరక్షణ కార్యక్రమంలో ముందుగా విద్యార్థులు బంగారు పిచ్చుకలను చూడటానికి పొలాల్లోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేసంలో ఆయన మాట్లాడారు. బంగారు పిచ్చుకలు పంటలను ఆశించిన క్రిమి, కీటకాలను ఆహారంగా తీసుకుని పంటలకు, తద్వారా మానవాళికి ఉపకరిస్తాయి అన్నారు. అలాగే పిచ్చుకలు గూడు పెట్టె గడ్డి ని కాపాడుకోవాలి అని వివరించారు. రసాయన క్రిమి సంహారక మందులు, రసాయన కలుపు తీత మందులు బంగారు పిచ్చుకలకు మరణానికి కారణం అయ్యాయి అని పేర్కొన్నారు.అందకే ముందుగా రసాయన కలుపు తీత మందులు నిషేధించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పశుపక్ష్యాదులు కోసం నీరు అందుబాటులో ఉంచాలన్నారు . సమస్త జీవరాశినీ కాపాడుకోవాలి అని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సి హెచ్ కేశవరావు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు. తమ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, మొక్కలు పెంచడం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అన్నారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ ఇచ్చిన పర్యావరణ దినోత్సవాల కాలమానిని ఆధారంగా పర్యావరణ దినోత్సవాలు నిర్వహించుతామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు డాక్టర్ పి రాంబాబు, పీపుల్స్ పవర్ సంస్థ ప్రతినిధి నిమ్మకాయల భాస్కర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
బంగారు పిచ్చుకల పరిరక్షణకు కృషి చేయాలి #vvwnews #latestnews
15
previous post