చెత్త రహిత పాలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
– సమస్త జీవరాశినీ కాపాడుకోవాలి
– మన విశాఖ ను మనమే దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి
– విద్యార్థులు అందరూ గ్రీన్ సోల్జర్స్ గా తయారు అవ్వాలి
-జెవి రత్నం , వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
చెత్త రహిత పాలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. గురువారం ఉదయం మధురవాడ దగ్గర మిధిలాపురిలోని గ్లోబ్ విద్యా సంస్థలో ప్రిన్సిపాల్ లలిత అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం నేతృత్వంలో స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర లో భాగంగా “చెత్త రహిత పరిపాలన” (జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన విశాఖ నగరంలో ఎక్కడా చెత్త పారవేయరాదని, జి విఎంసి వాహనాలకు చెత్త ఇవ్వాలని కోరారు. మన విశాఖ ను మనమే దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. సమస్త జీవరాశినీ కాపాడుకోవాలి అని వివరించారు. ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడే ప్రమాదం లో పడుతుంది అన్నారు. విద్యార్థులు అందరూ పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత కోసం గ్రీన్ సోల్జర్స్ గా తయారు అవ్వాలి అని పిలుపునిచ్చారు. విద్యార్థులు, మహిళలు, నగరవాసులు అందరూ చెత్త రహిత నగరంగా విశాఖ మహానగరాన్ని తీర్చి దిద్దడానికి కృషి చేయాలని కోరారు. మన అందమైన నగరాన్ని ఒక సుందరమైన వనంగా తీర్చి దిద్దాలని కోరారు. వంటింటి వ్యర్థాలతో ఎరువు తయారు చేసి ఎవరి ఇంటి వద్ద వారె కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించడం అవసరం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లలిత, గ్రీన్ వాలంటీర్ ఐ కృష్ణ కుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు
చెత్త రహిత పాలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి #vvwnews #news
2