జీవవైవిధ్య పరిరక్షణకు పర్యావరణ విద్య అవసరం #vvwnews

by vvwnews.com

జీవవైవిధ్య పరిరక్షణకు పర్యావరణ విద్య అవసరం
– అంతర్జాతీయ పర్యావరణ విద్యా దినోత్సవాన్ని జయప్రదం చేయండి
– అంతర్జాతీయ స్వచ్ఛ విద్యుత్తు దినోత్సవం జయప్రదం చేయండి
ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
జీవవైవిధ్య పరిరక్షణకు పర్యావరణ విద్య అవసరం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం మద్దిలపాలెం లోని శ్రీ భావన విద్యా నికేతన్, అక్షర ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థలలో, అంతర్జాతీయ పర్యావరణ విద్యా దినోత్సవాన్ని, అంతర్జాతీయ స్వచ్ఛ విద్యుత్తు దినోత్సవం కార్యక్రమాలను గ్రీన్ సోల్జర్స్ తో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు దినోత్సవాలనూ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో జనవరి 26న నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు. వాతావరణ సంక్షోభాన్ని ప్రధానంగా వెలుగులోకి తీసుకువచ్చి, భద్రమైన, మరింత సహనశీలమైన, స్థిరమైన భవిష్యత్తును అందించే పరిష్కారాలపై దృష్టి సారించాలి అని కోరారు. ప్రజలు, భూమి, సమస్త జీవరాశి ప్రయోజనాల కోసం, స్వచ్ఛమైన, సమగ్రమైన పరివర్తన కోసం అవగాహన పెంచడానికి, కార్యాచరణను సమీకరించడానికి కృషి చేయాలని అన్నారు. క్లీన్ ఎనర్జీని స్వీకరించడం ద్వారా శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చేయాలని కోరారు. ప్రతి విద్యా సంస్థలో హరిత సైనికులను (గ్రీన్ సోల్జర్స్) ఏర్పాటు చేయడం ద్వారా వారానికి ఒకరోజు రెండు గంటల పాటు పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు చేత కార్యక్రమాలు నిర్వహించాలని, నెలలో ఒక రోజు పర్యావరణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీ భావన విద్యా నికేతన్ లో నీలిమ, అక్షర ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థలో సునీత, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడారు .

Use Social Media to Spread the Word about Our News

related articles