మన అరణ్యాలను మనమే కాపాడుకోవాలి- సమస్త జీవరాసిని పరిరక్షించాలి.

by vvwnews.com

మన అరణ్యాలను మనమే కాపాడుకోవాలి
– సమస్త జీవరాసిని పరిరక్షించాలి.
– ఏ జీవి అంతరించినా మానవాళికే నష్టం
– విశ్వంలో జీవరాశితో వేరొక గోళం లేదు
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం
మన అరణ్యాలను మనమే కాపాడుకోవాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పెందుర్తి లోని బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహం వద్ద కూరగాయల, పండు అరటి మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. సమస్త జీవరాసిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఏ జీవి అంతరించినా మానవాళికి మనుగడే లేదు అనె అంశాన్ని గుర్తు ఉంచుకోవాలి అని వివరించారు. ఒక జీవితో మరొక జీవికి సంబంధం కలిగి ఉంటుంది అన్నారు. జీవావరణ చక్రంలో ఏ జీవి అంతరించినా మానవాళికే నష్టం అనే అంశం గుర్తించి సమస్త జీవరాశినీ కాపాడుకోవాలి అని వివరించారు. విశ్వంలో జీవరాశితో వేరొక గోళం లేదని, ఈ ఒక్క భూగోళం సమస్త జీవరాశితో కళకళలాడుతూ ఉండేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి అని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సత్యవతి, పలువురు విద్యార్థినులు మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles