ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు శ్రీ బాలాజీ విద్యాసంస్థల ఆధ్వర్యన మెగా జాబ్ మేళా ఉత్సాహవంతంగా జరిగింది… విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం, కళాశాల ప్రాంగణం నందు జరిగిన ఈ కార్యక్రమానికి అతిధులుగా నగర మేయర్,, పీల శ్రీనివాసరావు,, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు… ఈ సందర్భంగా అతిథులు సరస్వతి పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వలనంతో మేళాను లాంచనంగా ప్రారంభించారు… అనంతరం వారు మాట్లాడుతూ,, ఇటువంటి కార్యక్రమాలు, ప్రతిభావంతులైన ఉద్యోగులు కావాలనుకునే కంపెనీలకు,, మంచి ఉపాధి కోరుకునే యువతకు, ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు… ఈ మేళాల ద్వారా కేవలం ఉపాధి కల్పనే గాక,,, అవుత్సాహిక పారిశ్రామికవేత్తలుగా యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు… కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ కే నాగేశ్వరరావు మాట్లాడుతూ,, జాబ్ మేళా విశేషాలను వివరించారు…. కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రతినిధులు,, బాలాజీ విద్యాసంస్థల సిబ్బంది,,,, స్థానిక నాయకులు,, తదితరులు పాల్గొన్నారు….
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు శ్రీ బాలాజీ విద్యాసంస్థల ఆధ్వర్యన మెగా జాబ్ మేళా
4