పర్యాటక నగరంలో పట్నం హౌస్ శుభారంభం 30 డిసెంబర్ 2025: పర్యాటక నగరంగా ఆంధ్రప్రదేశ్

by vvwnews.com

పర్యాటక నగరంలో పట్నం హౌస్ శుభారంభం
30 డిసెంబర్ 2025: పర్యాటక నగరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులనే కాక పరిసర రాష్ట్ర ప్రజలను అలరిస్తున్న విశాఖ నగరంలో బీచ్ రోడ్డు సమీపంలో ఈరోజు “పట్నం హౌస్” రెస్టారెంట్ ప్రారంభించారు. “పట్నం హౌస్” రెస్టారెంట్ విశాఖ బీచ్ అందాల కనువిందు తోపాటు నోరూరించే కమ్మని రుచులను అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ MVSS.బాపారావు, డాక్టర్ KV.మధు బాబు, డాక్టర్ బి. లీలాప్రసాద్ గార్లు ప్రత్యేక అతిధులుగా పాల్గొన్నారు.

“పట్నం హౌస్” రెస్టారెంట్ బీచ్ రోడ్ లో రామకృష్ణ మిషన్ ఎదురుగా పర్యాటకులకు అందమైన తీర ప్రాంతం అందాలతో పాటు విభిన్న రుచులను అందించుటకు సిద్దంగా ఉందని రెస్టారెంట్ నిర్వాహకులు చెపుతున్నారు. తమ రెస్టారెంట్ ఇండోర్ 38 మరియు అవుట్ డోర్ 36 సీటింగ్ సామర్థ్యం కలిగి ఉందని, ఎనతో అనుభవం కలిగిన చెఫ్స్ ( వంటవారు) మీ అభిరుచులకు అనువైన ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ మరియు మొఘలాయ్ వంటకాలను అందిస్తారని వారు తెలిపారు.

మన విశాఖ బీచ్ సమీపంలో పర్యాటకులకు అనువుగా తగినన్ని రెస్టారెంట్స్ లేవని, ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించుటకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి అనేక ఇతర రాష్ట పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, వాఉ కోరుకునే రుచికరమైన వంటకాలను అందించాలనే లక్షంతోనే ఇక్కడ తమ “పట్నం హౌస్” రెస్టారెంట్ ఈరోజు ప్రారంభించాము అన్నారు. మా నిపుణులైన విశిష్ట అనుభవం కలిగిన చెఫ్స్ ద్వారా ఉత్తమమైన వంటకాలను అందిస్తామని, ఆహారం నాణ్యత విషయంలో ఎలాటి రాజీకి అవకాశం ఇవ్వమని ఈ సందర్భంగా నిర్వాహకులు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో “పట్నం హౌస్” రెస్టారెంట్ ప్రారంభించి నిర్వాహకులు చాల మంచి పనిచేసారు అన్నారు. పర్యాటకులకు మంచి భోజన సదుపాయాలు అందించటం చాల ముఖ్య అన్నారు. విభిన్న ప్రాంతాల నుండి వచ్చే వారికి రుచికరమైన విభిన్న రుచుల వంటకాలను అందించే ఏర్పాటు చేసిన నిర్వాహకులను వారు అభినందించారు. ఆతిధ్య రంగం ఎంతో అభివృద్ది పథంలో ఉందని, మన నగరానికి వచ్చే పర్యాటకులకు ఆతిధ్యం ఇచ్చే “పట్నం హౌస్” రెస్టారెంట్ ప్రారంభించటం మనందరికీ సంతోషదాయకం అన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles