జననేత జన్మదిన వేడుకలు * 41వ వార్డులో 12గంటలకు కేక్ కటింగ్ చేసిన కార్పొరేటర్ పూర్ణిమ,శ్రీధర్ దంపతులు

by vvwnews.com

పండుగ వాతావరణంలో జననేత జన్మదిన వేడుకలు

* 41వ వార్డులో 12 గంటలకు కేక్ కటింగ్ చేసిన కార్పొరేటర్ పూర్ణిమ,శ్రీధర్ దంపతులు

కంచరపాలెం, డిసెంబర్ 20, (ఆంధ్రప్రభ): మాజీ ముఖ్యమంత్రి, జనహృదయనేత, వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 41 వ వార్డులో ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి 12 గంటలకు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్ మాట్లాడుతూ జగనన్న జన్మదిన వేడుకలు అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద పండుగ లాంటిదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలతో పాటు మహిళలు సంతోషంగా ఉండేవారన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, విద్యా, వైద్యం, ఉద్యోగ కల్పనలో సంచలనాత్మకమైన మార్పులతో జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. 41 వార్డు నుండే తమ అధినేత పుట్టినరోజు వేడుక ప్రారంభం ఘనంగా కావాలన్న ఆకాంక్షతో స్థానిక ప్రజలు కార్యకర్తలు కలిసి బాణాసంచాలతో ఈ పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. స్థానిక ఎన్నికల ఓడిపోతామన్న భయంతో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి విజయం తధ్యమని మళ్లీ 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రి గా జగన్మోహన్ వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు సీనియర్ నాయకులు వెలంగిని రావు, కుమార్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles