*కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ మిర్యాల వెంకట్రావు గారి 86 వ జయంతి మహోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
ఈ రోజు అనగా *14.12.2025* తేదీన విశాఖపట్నం ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ మిర్యాల వెంకట్రావు గారి 86 వ జయంతి ఉత్సవాలలో పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్గీయ వెంకటరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదర్శప్రాయుడు వెంకట్రావు గారు వారి నుంచి అనేక విషయాలు తాము నేర్చుకున్నామని, ఆయన ఆశయాలు అనుగుణంగా పని చేస్తూ ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాపు సంఘం నాయకులు, మిర్యాల వెంకటరావు గారి అభిమానులు, వివిధ అనుబంధ సంఘాల కాపు నాయకులు ,ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు