మహోన్నత ఆశయాలతో
కాపు కుల భీష్ముడు స్వర్గీయ మిరియాల వెంకటరావు 89 వ జయంతి వేడుకలను ఈనెల 14న సిరిపురం వుడా చిల్డ్రన్ ఏరినాలో నిర్వహిస్తున్నట్లు మిరియాల వెంకటరావు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కటారి అప్పారావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం
డాబా గార్డెన్స్ వి జే ఎఫ్ ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన ట్రస్ట్ సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మిరియాల
1939 డిసెంబర్ 25న రాజమండ్రిలో జన్మించిన ఆయన, ప్రకాశం జిల్లా నేపథ్యం కలిగినా విజయవాడలో ఎక్కువ కాలం గడిపారు. విద్యార్థి దశ నుంచే సామ్యవాద భావాలతో ఆకర్షితుడై, తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లారు. ట్రేడ్ యూనియన్లలో రిక్షా కార్మికులు, ఫ్యాక్టరీ వర్కర్ల సంఘాల నేతగా పనిచేశారు.రాష్ట్రంలోని అత్యధిక జనాభా సాంద్రత కలిగిన కాపు కులంలో 27% ఎన్నో ఉద్యమాలు మిరియాల వెంకటరావు చేశారన్నారు. 1980 విజయవాడలో వంగవీటి మోహన్ రంగ రాజకీయంగా ఎదుగుతున్న దశలోఎంతో కీలకపాత్ర పోషించారు అన్నారు. ప్రభుత్వాలు ఏర్పరచాలన్న జనసాంద్రత కలిగిన కాపు కులస్తులు ఎంతో కీలకమయ్యారన్నారు. అప్పట్లో సామాజిక ఉద్యమాల్లో ఎన్నో కీలక పదవులు చేశారన్నారు. వారి అభ్యున్నత ఆయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో హైదరాబాదులో ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి అభ్యున్నత ఆశయాలను. ఆయన శత జయంతి ఉత్సవాలు వచ్చిన వరకు ప్రతి ప్రాంతంలోని ప్రతి ఏడాదికి ఒక ప్రాంతంలో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.సామాజిక సేవలు కుల పెద్దలకు స్కాలర్‌షిప్‌లు, చదువుకు ఆర్థిక సహాయం అందించి అక్షరాస్యత పెంపొందించారు. కార్తీక వన సమారాధనలు, కల్యాణ మండలాల ద్వారా వెనుకబడిన కులాల సంబంధాలు బలోపేతం చేశారు. కాపు ప్రజాప్రతినిధులకు సన్మాన సభలు ఏర్పాటు చేసి ధైర్యం నింపారన్నారు.
డాక్ యార్డ్ కే టీ బి గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ
ఈ నెల 14 నసిరిపురం వుడా చిల్డ్రన్ వేదికగా ఉదయం 10 గంటల నుంచి కూడా మిరియాల ఫౌండేషన్ నిర్వహించనుందన్నారు.శతాబ్ది ఉత్సవాలు జరిగే వరకు కూడా ఒక్కొక్క ప్రాంతంలో జరపాలని నిర్ణయించారన్నారు..ఈ కార్యక్రమం ను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలనీ పిలుపు నిచ్చారు. కార్యక్రమం లోసభ్యులు సంకు వెంకటేశ్వర రావు, మారిశెట్టి మురళి కుమార్ ..డాక్ యార్డ్ కేటేబి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు . అధ్యక్షుడు బత్తుల చిరంజీవి,కోటపోతుల శ్రీనివాసరావు,, పసుపులేటి శేఖర్, కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ,పోటు మహేష్, సుబ్బు విశ్వనాధం, గాదె విజయ్ కుమార్ తదితరులు పాల్గున్నారు.
కాపు కుల భీష్ముడు స్వర్గీయ మిరియాల వెంకటరావు 89 వ జయంతి వేడుకలను ఈనెల 14న సిరిపురం వుడా చిల్డ్రన్
11