గుండె దడను చిన్న లక్షణంగా చూసి నిర్లక్ష్యం చేయకూడదని మెడికవర్ హాస్పిటల్స్ ఎలక్ట్రో ఫిజియోలజిస్ట్ & సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ. సురేష్ తెలిపారు గుండెదడను చాలామంది సాధారణ సమస్యగా భావించి తేలిగ్గా తీసుకుంటారని అన్నారు. అయితే కొన్నిసార్లు ఇది హృదయ సంబంధిత కీలక సమస్యలకు ముందస్తు హెచ్చరికగా మారుతుందని అన్నారు.వెంకోజి పాలెం మెడికవర్ ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండె ఒక్కసారిగా వేగంగా బలంగా అసమానంగా గ్యాప్ ఇచ్చి కొట్టుకునే పరిస్థితిని పాల్పిటేషన్స్ అంటారని పేర్కొన్నారు. గుండె దడ కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు కొనసాగవ చ్చని అన్నారు. ఇది ఎక్కువ హానికరం కానప్పటికీ కొన్నిసార్లు తీవ్రమైన హృదయ సంబంధిత రుగ్మతలకు సంకేతం కావచ్చని తెలిపారు. జీవనశైలి మార్పులు అధిక ఒత్తిడి, శారీరక శ్రమ, కెఫెన్ పానీయాలు, థైరాయిడ్ సమస్యలు,రక్తహీనత రక్తపోటులో మార్పులు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు వంటి కారణాలు పాల్పిటేషన్స్ కు దారితీస్తాయని అన్నారు. తరచూ వచ్చే గుండె దడ, శ్వాసలోపం, ఛాతి నొప్పితో కలిసివచ్చే దడను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని అన్నారు.ఇలాంటి సందర్భాల్లో గుండె వైద్య నిపుణులను సంప్రదించాలని చెప్పారు.హార్ట్ ఎటాక్ వచ్చిన మూడు గంటల వ్యవధిలో అవసరమైన చికిత్స తీసుకోవాలని లేని పక్షంలో గుండెలో కండరాలు పాక్షికంగా దెబ్బతింటాయని అన్నారు. తరచూ వచ్చే దడ, శ్వాస లోపం, తల తిరుగుడు ఛాతీ నొప్పితో వచ్చే దడ లను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కార్డియాలజీ నిపుణులను సంప్రదించాలని మెడికవర్ యూనిట్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ సూచించారు.
గుండె దడను చిన్న లక్షణంగా చూసి నిర్లక్ష్యం చేయకూడదని మెడికవర్ హాస్పిటల్స్ ఎలక్ట్రో
by vvwnews.com
written by vvwnews.com
12