చిక్కుకున్న 9మంది మత్స్యకారులను తక్షణమే విడిపించండి ! #vvwnews

by vvwnews.com

చిక్కుకున్న 9మంది మత్స్యకారులను తక్షణమే విడిపించండి !

* చంద్రబాబు చేతకాని పాలనకు ఇదే నిదర్శనం..

* రెండు నెలలు గడుస్తున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం

* వాడబలిజ ఓట్లతో గెలిచిన పవన్ కళ్యాణ్ జాడ ఎక్కడ?

తోటి మత్స్యకారుడిగా తొమ్మిది కుటుంబాలకి రూ. 45000లు సహాయం అందిస్తాను!

* మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్

అక్టోబర్ 9వ తేదీన బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారులను తక్షణమే విడిపించుకునేలా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆసీలమెట్ట కార్యాలయంలో శనివారం రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ఇతర వైసీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులు ఓట్లతో గెలిచి వారి బాగోగులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. భోగాపురం నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారుల మిత్ర దేశమైన బంగ్లాదేశ్ లో చిక్కుకుపోతే రెండు నెలలైనా వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోగా ఉపాధి కోల్పోయిన ఆయా మత్స్యకార కుటుంబాలకి కనీస సాయం అందించలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆయా 9 మంది మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5000లు చొప్పున రూ. 45,000లు తోటి మత్స్యకారుడుగా సహాయం అందిస్తానని ఈ సందర్భంగా వాసుపల్లి ప్రకటించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles