రంగనాడు ఆవిర్భావ బహిరంగ సభను ఈనెల 26న బీచ్ రోడ్ లో నిర్వహిస్తున్నట్టు గాదె బాలాజీ తెలిపారు. నగరంలోని హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహన్ రంగ విశేష కృషి చేశారని అన్నారు. కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వంగవీటి అభిమానులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు రంగనాడును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేవలం కాపు సామాజిక వర్గాన్నే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలను మైనారిటీలను కలుపుకుంటూ రంగా నాడును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 26న బీచ్ రోడ్ లోని కాళీమాత ఆలయం ఎదురుగా జరగనున్న బహిరంగ సభకు రంగా కుటుంబీకులు, పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని హాజరవుతున్నారు చెప్పారు రంగానాడు రాజకీయ వేదిక కాదని స్పష్టం చేశారు. బహిరంగ సభలో తమ అజెండాను ప్రకటిస్తామని తెలిపారు. బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
17