December 12, 2025

by vvwnews.com

చిక్కుకున్న 9మంది మత్స్యకారులను తక్షణమే విడిపించండి !

* చంద్రబాబు చేతకాని పాలనకు ఇదే నిదర్శనం..

* రెండు నెలలు గడుస్తున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం

* వాడబలిజ ఓట్లతో గెలిచిన పవన్ కళ్యాణ్ జాడ ఎక్కడ?

తోటి మత్స్యకారుడిగా తొమ్మిది కుటుంబాలకి రూ. 45000లు సహాయం అందిస్తాను!

* మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్

అక్టోబర్ 9వ తేదీన బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారులను తక్షణమే విడిపించుకునేలా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆసీలమెట్ట కార్యాలయంలో శనివారం రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ఇతర వైసీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులు ఓట్లతో గెలిచి వారి బాగోగులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. భోగాపురం నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారుల మిత్ర దేశమైన బంగ్లాదేశ్ లో చిక్కుకుపోతే రెండు నెలలైనా వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోగా ఉపాధి కోల్పోయిన ఆయా మత్స్యకార కుటుంబాలకి కనీస సాయం అందించలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆయా 9 మంది మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5000లు చొప్పున రూ. 45,000లు తోటి మత్స్యకారుడుగా సహాయం అందిస్తానని ఈ సందర్భంగా వాసుపల్లి ప్రకటించారు.
జనసేన ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో మత్స్యకారులకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ముందు ఒకలా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడటం విడ్డూరం అన్నారు. వైసిపి ప్రభుత్వం ఉంటే మత్స్యకారుల పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని వాసుపల్లి స్పష్టం చేశారు. మత్స్యకారులు అంటే మొదటి నుండి చిన్న చూపు చూసే చంద్రబాబు వైఖరి ఇప్పటికీ మారలేదన్నారు.
బంగ్లాదేశ్ నేవీకి చిక్కిన వారు బయటకు వచ్చేసరికి ఆరు నెలలు పడుతుందని చెప్పడం దారుణం అన్నారు. మత్స్యకారులు కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే వారిని విడిపించడంతోపాటు ఆ కుటుంబాల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వాసుపల్లి కోరారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా మాట్లాడటం జనసేన పార్టీకే సిగ్గుచేటు అన్నారు. గతంలో శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్థాన్లో చిక్కినప్పుడు జగన్మోహన్ రెడ్డి వీలైనంత తొందరగా వారిని విడిపించి ఆదుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. కేవలం విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి రూ. 152 కోట్లు విడుదల చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే అన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బోట్లకు మంటలు ఆరకముందే ఒక్కొక్క బోటుకు రూ.40 లక్షలు నష్టపరిహారం జగన్ ఇచ్చారన్నారు. హుదూద్ సమయంలో చంద్రబాబు నష్టపోయిన బోట్లకు కేవలం 5 లక్షలు ప్రకటించి ఇవ్వలేదన్నారు. మత్స్యకారుల లబ్ధి కోసం నా చెప్పులు అరిగేలా తిరిగానని ఫలితం లేకపోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోటి 30 లక్షలు తక్షణమే రిలీజ్ చేసి ఆదుకున్నారన్నారు. మత్స్యకారులు అంటే చిత్తశుద్ధి లేని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు ఎన్నికల ముందు డబల్ ఇంజన్ సర్కారని
మోసం చేశారన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మాట్లాడుతూ మమకారంతో జగన్ పరిపాలిస్తే ఇదే చంద్రబాబు అహంకారంతో పాలన సాగిస్తున్నాడని దుయ్యబట్టారు. అభివృద్ధి కష్టం జగన్ మోహన్ రెడ్డి ది అయితే ఆర్భాటాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కూటమి పాలన పూర్తిగా గాడి తప్పిందని జీవనం కోసం ప్రాణాలు పణంగా పెట్టి నీటి మీద సాహసం చేసే మత్స్యకారులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమిలో పవన్ కళ్యాణ్ పవర్ లేదని విమర్శించారు. తక్షణమే బంగ్లాదేశ్లో చిక్కికపోయిన మత్స్యకారులను విడిపించి నష్టపరిహారం 5 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles