అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ వరం “ఈ శ్రమ్”కార్డు
– కార్మికుల కోసమే పనిచేస్తుంది ప్రభుత్వ కార్మిక శాఖ
– కె. మనోజ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అనకాపల్లి.
అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ వరం “ఈ శ్రమ్”కార్డు అని అనకాపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె. మనోజ్ పేర్కొన్నారు. గురువారం ఉదయం అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి లో ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ విభాగం అనకాపల్లి హెచ్ ఆర్ డి ఐ. కృష్ణ కుమారి అద్యక్షతన కొండకర్ల ఆవ ఇన్లేండ్ ఫిషర్ మేన్ సొసైటీ తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు కష్టాలు పరిగణనలోకి తీసుకుని కేంద్రం అసంఘటిత కార్మికులకు సామాజిక బధ్రత కల్పించడం కోసం ప్రవేశపెట్టింది. ఈ శ్రమ కార్డులకు వ్యవసాయ రంగం లో కార్మికులు, ఆశా వర్కర్లు, వలస కార్మికులు, ఇళ్ళల్లో, దుకాణాలు లో పని చేస్తున్న కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బళ్ళు వర్కర్లు, మత్స్యకారులు, పాల వ్యాపారులు, చేతి వృత్తులు, భవన, ఇతర నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ పథకం కార్డు ఉన్న వారికి ఈ శ్రమ్ కార్డు లు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. కార్మికుల కోసమే పనిచేస్తుంది ప్రభుత్వ కార్మిక శాఖ అని వివరించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ కుమారి మాట్లాడుతూ ఆవ మీద ఆధారపడి జీవిస్తున్న వారందరికీ ఈశ్రమ్ కార్డు లు వచ్చేందుకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎ ఎల్ ఒ 2, జూనియర్ అసిస్టెంట్ అభిలాష్, కొండకర్ల ఆవ ఇన్లేండ్ ఫిషర్ మెన్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు రమణ, నాగేశ్వరరావు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.
అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ వరం “ఈ శ్రమ్”కార్డు
13