శోభాయమానంగా సాగిన శ్రీ స్వామివారి సహస్రనా మార్చన భక్తుల గోత్ర నామాలతో సంకల్పం*#vvwnews

by vvwnews.com

*శోభాయమానంగా సాగిన శ్రీ స్వామివారి సహస్రనా మార్చన భక్తుల గోత్ర నామాలతో సంకల్పం*

సింహాచలం,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా, దివ్యమైన క్షేత్రంగా విరాజిల్లు తున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో గురువారం శ్రీశ్రీశ్రీ స్వామి వారి సహస్ర నామార్చన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా జరిగింది ఈ సహస్రనామార్చన సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు దేవస్థానం యొక్క రోజువారీ ఆర్జిత సేవల్లో భాగంగా ఈ సహస్ర నామార్చనను నిర్వహించారు
ముందుగా దివ్యమైన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సవమూర్తి శ్రీ గోవింద రాజస్వామిని వారి ఉభయ దేవేరుల సమేతంగా ప్రత్యే కంగా అలంకరించిన మండ పంలో అత్యంత శోభాయ మానంగా అధిష్ఠింపజేశారు సహస్రనామార్చనలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడి గోత్రనామాలను పఠిస్తూ వేద పండితులు సంకల్పాన్ని పలికారు ఈ కార్యక్రమాన్ని పాంచరాత్రాగమశాస్త్ర పద్ధతిని అనుసరించి నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యం గా విశ్వక్సేనారాధన మరియు పుణ్యాహవచనం వంటి పవిత్ర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి కార్య క్రమానికి కమనీయమైన ఆరంభాన్ని ఇచ్చారు
అనంతరం వేద మంత్రో చ్ఛారణల మధ్య వేయి దివ్య నామాలతో స్వామివారికి సహస్రనామార్చన సేవను అద్భుతంగా నిర్వహించారు సహస్రనామార్చన పూర్తయిన తర్వాత వేద పండితులు మంత్రపుష్పం మరియు మంగళాశాసనాలు పఠించి, స్వామివారికి నివేదన సమర్పించారు భక్తులకు వేదాశీర్వచనాలను అందించి వారికి ప్రత్యేకంగా శేషవస్త్రా లను మరియు స్వామివారి పవిత్ర ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ సేవలో పాల్గొన్న భక్తులను తదుపరి స్వామివారి మూలమూర్తి యొక్క అంతరాలయ దర్శనం కోసం అను మతించారు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దివ్య కృపకు పాత్రులయ్యేందుకు భక్తులందరూ ఈ పవిత్రమైన ఆర్జిత సేవల్లో పాల్గొని తరిం చాలని దేవస్థానం అధి కారులు కోరుతున్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles