*దక్షిణంలో హోరెత్తించిన సంతకాల సేకరణ ఉద్యమం*..
* *మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయండి*
* *దక్షిణ వైసీపీ కార్యాలయం నుండి బారీగా బైక్ ర్యాలీ*
* *జిల్లా కార్యాలయానికి ప్రతులను చేరవేసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి*.
ప్రభుత్వ పేదల వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలంటూ చేస్తున్న సంతకాల సేకరణ ఉద్యమం దక్షిణంలో హోరెత్తించింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం ముమ్మరంగా సాగింది. 14 వార్డులలో కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు సీనియర్ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించి సహకరించిన 60,000 సంతకాల ప్రతులను ఆశీలమెట్ట వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయానికి భారీగా బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు భూస్థాపితం చేయాలన్న చంద్రబాబు కుట్రతో 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధన ఆసుపత్రులలో పేదలకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్యం అందదని చెప్పారు. ఇంకా రోగనిర్ధరణ అలాగే ఇన్ పేషెంట్ మెడిసిన్స్ కి చార్జ్ చేస్తారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా మరో వైపు రాష్ట్రం పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు కోల్పోతుందని తెలిపారు.
గత ఏడాది 750 ఎంబిబిఎస్ సీట్లు సమకూర్చాల్సి ఉన్న చంద్రబాబు ప్రభుత్వ కక్ష పూర్తి విధానాలతో 700 సీట్లు కోల్పోయామని పేర్కొన్నారు.
2025 – 26 లో 1750 సీట్లు, అలా మొత్తం 2450 మెడికల్ సీట్లు మన పిల్లలు కోల్పోతున్నారని తెలియజేశారు.
1947 నుంచి 2022 వరకు రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఒక చరిత్రగా అభివర్ణించారు.
కూటమి ప్రభుత్వం పి పిపి పేరిట డ్రామాలు ఆడుతోందని ప్రజలకు అర్థమైందని వివరించారు.
వైయస్ జగన్ ప్రభుత్వం హయాంలోనూ 7 మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తికాగా అయిదు కాలేజీలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి అని చెప్పారు. మరో 10 కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నట్లు వెల్లడించారు. వైయస్సార్సీపి ప్రభుత్వం దిగిపోయేసరికి వాటిలో దాదాపు రూ. 3 వేల కోట్ల విలువైన పనులు జరిగినట్లు పేర్కొన్నారు.
కొత్త మెడికల్ కాలేజీల కోసం ఏటా రూ. 1000 కోట్ల చొప్పున అయిదు ఏళ్ళు వ్యయం చేస్తే చాలని, కానీ ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేయకుండా, పి పి పి పేరుతో ప్రైవేటీకరణ పై
ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు.
వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా పూర్తిచేసి అన్నిటిని ప్రభుత్వం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా గురువులు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, దక్షిణ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.