3
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడంతో పాటుగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం దక్కకుండా చేయడమేనని విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 50వ వార్డు మాధవధార ప్రధాన రహదారి వద్ద కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ఆయన మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కోటి సంతకాలతోనే మన స్వరం వినిపిద్దామంటూ ఈ సందర్భంగా కేకే రాజు పిలుపునిచ్చారు.