4
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని సీతమ్మధారలోని కృష్ణమందిర్ లో మాస శివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుని కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. కమిటీ సభ్యులంతా కన్యాదాతలుగా బీజేపీ సీనియర్ నాయకులు సూర్య ప్రకాష్ రావు దంపతులను నియమించారు. అర్చకులు పార్వతీ పరమేశ్వరుల పరిణయాన్ని కనులపండువగా జరిపించారు. దేవతామూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం అన్నసమారాధన జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, బిజెపి నాయకులు శ్యామల దీపిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు తెన్నేటి నరసింహమూర్తి మాట్లాడారు..