బాలల దినోత్సవం సందర్భంగా తాటిచెట్లపాలెం విశ్వతేజ స్కూలు ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు

by vvwnews.com

బాలల దినోత్సవం సందర్భంగా తాటిచెట్లపాలెం విశ్వతేజ స్కూలు ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వతేజ స్కూల్ కరస్పాండెంట్ భాస్కరరావు, ప్రిన్సిపల్ సునీత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎక్స్ చైర్మన్ రోటరీ క్లబ్ జి.ఎస్ రాజు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం పిల్లలతో కలిసి నిర్వహించడం చాలా ఆనందదాయకమన్నారు. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారని పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారని ఆయన అన్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం పిల్లలకు ఆటల పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles