18
చింతలఅగ్రహారం గ్రామానికి రాకపోకలు బంద్
చింతలగ్రహారంలో మొంథా తుపాన్ కారణంగా రైల్వే అండర్ పాత్ జలమయమయింది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి మంగళవారం ఉదయానికి పూర్తిగా నీటితో నిండుకుంది. మరో రోడ్డు మార్గంలో యూజీడి డ్రైనేజ్ మ్యాన్ హోల్ ద్వారా నీరు బయటకు రావడంతో గ్రామస్తులకు రాకపోకలు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.