సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం
మహా రాణి పేట (విశాఖ దక్షిణ):
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారి ఆఫీసు వద్ద కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న అఫీషియల్ కాలనీలో పతాకావిష్కరణ జిల్లా కార్యదర్శి డి స్రవంత్ ఆవిష్కరించారు. సహాయ కార్యదర్శి వర్మ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశంలోనే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి యూనియన్ ఉందని ఆ యూనియన్ 1945 లో రాజమండ్రిలో మొదలైందని క్రమేణ భారతదేశ మొత్తం సంచరించుకున్నదని అయితే 1968లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ గా గుర్తింపు పొందినదని అక్కడ నుంచి దినదిన ప్రవర్ధమానంగా భారతదేశ మొత్తం 1,20,000 మంది సభ్యత్వం కలిగిన పెద్ద యూనియన్ గా ఆయుర్భవించినదని అంతేకాకుండా ఏ యూనియన్ ప్రత్యేకత యాజమాన్యాలు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ యూనియన్ మాత్రం ఒక్కటిగా ఉందని కార్మికులందరూ ఒకే యూనియన్ లో ఉన్నారని ఇది ప్రపంచంలో అరుదైన సంఘటనని తెలియజేశారు ఈ కార్యక్రమానికి కోశాధికారి రామారావు మెడికల్ రిప్రజెంటేటివ్స్ తో పాటు సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా హాజరయ్యారని తెలియజేశారు.
ఇట్లు
D స్రవంత్