*ప్రచురణార్ధం / ప్రసారార్ధం*
*ఉడా పార్కుల్లో తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి*
*ఇఎస్ఐ, పిఎఫ్, రిటైర్మెంట్ సౌకర్యాలు అమలు చేయాలి*
*-విఎంఆర్డిఏ వర్కర్స్ Ê ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) డిమాండ్*
విఎంఆర్డిఏ పరిధి కైలాస్గిరి, ఉడాపార్కు, సెంట్రల్పార్కు తదితర పార్కుల్లో గార్డెన్ కార్మికులుగా పనిచేస్తున్న 18మంది కార్మికులను ఉడా యాజమాన్యం అక్రమంగా తొలగించడాన్ని ఉడా వర్కర్స్ Ê ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణమే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ఇఎస్ఐ, పిఎఫ్, రిటైర్మెంట్ సౌకర్యాలు అమలు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేసారు.
బుధవారం జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద ఉడా వర్కర్స్ Ê ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.కృష్ణారావు మాట్లాడుతూ ఉడా పరిధిలో 7సొసైటీల్లో సుమారు 250 మంది గార్డెన్ పనిచేస్తున్నారన్నారు. వీరెవరికీ కనీసం గుర్తింపు కార్డులు కానీ, ఇఎస్ఐ, పిఎఫ్, శెలవులతో కూడిన వారంతపు, లేబర్ హాలీడేస్, రిటైర్మెంట్ సౌకర్యాలు ఏవీ అమలు కాకపోవడం సిగ్గుచేటన్నారు. విశాఖపట్నం పర్యాటక కేంద్రం. ఉడా పరిధిలో నడుస్తున్న వివిధ పార్కులకు పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. విఎంఆర్డిఏకు ఆదాయం తెచ్చి పెట్టడంతో పాటు పర్యాటకంగా మంచి గుర్తింపు ఉందంటే అది కార్మికుల కష్టార్జితమేనన్నారు. ఉడాలో 600రూ॥లు జీతం నుండి గత 35సం॥లకు పైగా పనిచేస్తున్న కార్మికులను 60సం॥లు నిండిన కారణంగా 11మందిని తొలగించారు. మరో 7గురు కార్మికులు శెలవులు పెట్టారని నెపంతో తొలగించారు. ఇది దుర్మార్గపు చర్య. వాస్తవంగా ఉడాలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించడం వలన వీరిని తొలగించారు. వీరిని తొలగించాక కొంతమంది సిబ్బంది అధికారులతో కుమ్మక్కై అక్రమ పద్దతిలో ఎలా మనుషులను వేసుకుంటారని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం చేయాల్సిన విఎంఆర్డిఏ కమీషనర్, చైర్మెన్లు తప్పుడు సమాచారం ఆధారంగా వీరిని విధుల్లోకి తీసుకోమని, నష్టపరిహాం ఏమీ ఇవ్వమని చెప్పడం, నిర్ధారణకు రావడం విడ్డూరంగా ఉంది. సొసైటీలలో కార్మికులను తొలగించాలన్నా, వేసుకోవాలన్నా సొసైటీలకు హక్కులుంటాయి. కానీ ఆ హక్కులను తుంగలోతొక్కి వీరే ఆ చర్యలు చేపట్టడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది. పైగా వీరిని విధుల్లోకి తీసుకోవాలని డిఎఫ్ఓ అధికారితో మాట్లాడితే కార్మికుల వ్యక్తిగత విషయాలను లేవనెత్తడం సరైందికాదు. తొలగించిన కార్మికుల తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో పోరాడుతామని హెచ్చరించారు.
సిఐటియు మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికులకే ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే ప్రైవేట్, కాంట్రాక్ట్ సంస్థల్లో ఎలా భద్రత ఉంటుందని ప్రశ్నించారు. కార్మికులు తప్పుచేసారని ఉపాధినే తొలగించి శిక్షలు వేయడం సరైందికాదు. చట్టప్రకారం తొలగించే ముందు నోటీస్ ఇవ్వాలి. తప్పులు చేసే వారిని తొలగిస్తే వారికి నోటీసు ఇచ్చి ఎంక్వయిరీ చేయాలి. అలాగే ఆ సొసైటీకి దృష్టికి తీసుకువెళ్ళాలి. పద్దతి ప్రకారం చేయకుండా దురద్ధేశంతో చేయడం చట్టరీత్యానేరం. ప్రధాన యజమానిగా కార్మికులకు అన్ని హక్కులు కల్పించే చర్యలు కమీషనర్ ఎందుకు చేయటం లేదు? ఒక అధికారిని కలిసే హక్కు రాజ్యాంగం కల్పించినప్పటికీ తొలగింపుకు కారణమైన కార్మికులను, యూనియన్ నాయకులను కమీషనర్ ఎందుకు కలవనీయకుండా, చర్చలు చేయకుండా దాటవేయడం అత్యంత దుర్మార్గం. తక్షణమే కమీషనర్ చర్చలు జరిపి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్చేసారు.
(వి.కృష్ణారావు)
ప్రధాన కార్యదర్శి
ఉడా పార్కుల్లో తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి*#vvwnews
17
previous post